Hero Siddharth : కొన్నేళ్ల క్రితం ఉదయ్ కిరణ్, తరుణ్, నితిన్, సిద్ధార్థ్ లాంటి వారు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకుని యువతుల కలల రాకుమారులుగా కొనసాగారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ, నాగార్జున వంటి స్టార్ హీరోల తరువాత అంతటి ఎనర్జీని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. వాళ్ల రొమాంటిక్ కామెడీ చిత్రాలు, లవ్ స్టోరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అంతే కాకుండా వారు నటించిన చాలా చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. యువ కెరటాల్లో అనుకోకుండా ఉదయ్ కిరణ్ కాలం చేయగా మిగిలిన వారిలో తరుణ్ పూర్తిగా సినిమాలకు దూరమై వ్యాపారం చేసుకుంటున్నారు. నితిన్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని వరుసగా సినిమాలు చేస్తుండగా… సిద్ధార్ధ్ మాత్రం అడపదడపా సినిమాలతో నేనున్నానంటూ గుర్తు చేస్తున్నాడు.
ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన సిద్ధార్ధ్ తన సినీ కెరీర్ నాశనం చేసుకుని భార్యతో విడాకులు తీసుకోవడానికి దారి తీసిన కారణాల గురించి తెలుసుకుందాం.. హీరో సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ ఎప్పుడూ రహస్యమే. తాను ఫస్ట్ మేఘన అనే మహిళను పెళ్లి చేసుకున్నాడని, ఆమెతో ఇద్దరు పిల్లలు కూడా కన్నాడని వార్తలు వచ్చాయి. దంపతులు పిల్లల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న జంట విడిపోవడానికి కావడానికి సిద్ధార్థ్ వేరే అమ్మాయితో ఉండటమే కారణమని తెలుస్తోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్. చాలా సార్లు ఆమెతో చెట్టాపట్టాలేసుకుని మీడియా కళ్లలో పడ్డాడు సిద్ధార్ధ్ . కానీ వారి బంధం ఎంతో కాలం నిలువలేదు. మొదటి భార్య మేఘన కారణంగా సోహా అలీ ఖాన్ తో సిద్ధార్ధకు విబేధాలు మొదలయ్యాయి. సినిమాలతో కాకుండా ఇలాంటి కాంట్రవర్సీలతో ఎప్పుడూ సిద్దార్ద ట్రెండింగ్ లో ఉంటాడు.. అతడు ప్రస్తుతం అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.