Urvashi Rautela : హాట్ మోడల్ గా మంచి పేరుని సంపాదించుకున్న ఊర్వశి రౌటేలా తో టాలీవుడ్ మరియు బాలీవుడ్ మేకర్స్ వరుసగా ఐటెం సాంగ్స్ చేయించుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. చూపులు తిప్పుకోలేని అందం తో కనిపించే ఈమెకి హీరోయిన్ రోల్స్ ఎందుకు ఎవ్వరూ అనేది చాలా మంది అభిమానుల్లో మెదిలే ప్రశ్న. ఐటెం సాంగ్ కాకుండా వేరే పాత్రలను ఆమెకి ఆఫర్ చెయ్యాల్సి వస్తే విలన్ రోల్స్ ని మాత్రమే ఆఫర్ చేస్తున్నారు.

కానీ ఊర్వశి ఈమధ్య కేవలం ఐటెం సాంగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఐటెం సాంగ్స్ ద్వారా ఆమెకి వచ్చే రెమ్యూనరేషన్స్ తో పోలిస్తే సినిమాల్లో పాత్రలు చెయ్యడం ద్వారా వచ్చే డబ్బులు చాలా తక్కువ. అందుకే ఆమె ఐటెం సాంగ్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. రీసెంట్ గా ప్రతీ కమర్షియల్ సినిమాలో ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్ ని తప్పనిసరిగా పెడుతున్నారు మేకర్స్.

తెలుగు ఈమె ‘వాల్తేరు వీరయ్య’ సినిమా లో ‘బాస్ పార్టీ’ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఈ పాట తర్వాత ఆమెకి ‘ఏజెంట్’ ,’బ్రో’, ‘స్కంద’ వంటి చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసే అవకాశం దక్కింది.వీటిల్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తప్ప మిగిలినవన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఊర్వశి రౌటేలా ని తీసుకుంటే సినిమా ఫ్లాప్ అవ్వుధి అనే సెంటిమెంట్ భయం జనాల్లో పట్టుకుంది.

అంతే కాకుండా ఊర్వశి రౌటేలా ఒక్కో సినిమా కి ఐటెం సాంగ్ చెయ్యడం కోసం మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అడుగుతుందట. అంటే నాలుగు నిమిషాల పాట కి నాలుగు కోట్ల రూపాయిల లెక్కన తీసుకుంటే ఆమె నిమిషానికి కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తుందన్నమాట. ఐటమ్స్ సాంగ్స్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఈమెనే. కానీ ఈమె డిమాండ్ చేసే రెమ్యూనరేషన్ ని చూసి భయపడుతున్నారు నిర్మాతలు.