Ram Charan : #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో గ్లోబల్ వైడ్ గా ఫేమ్ ని సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన తదుపరి చిత్రాన్ని సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, మధ్యలో కొన్ని బ్రేకులు పడడంతో విడుదల తేదీ విషయం లో జాప్యం ఏర్పడింది.
ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదల తేదీలను ఫిక్స్ చేసుకుంటున్న ఈ నేపథ్యం లో, తమ అభిమాన హీరో సినిమా విడుదల తేదీ ఎప్పుడో తెలియక అయ్యోమయ్యం లో పడ్డారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ప్రతీరోజు సోషల్ మీడియా లో మేకర్స్ ని ట్యాగ్ చేస్తూ బూతులు తిడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయట పడింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారి రామ్ నందన్ గా నటిస్తున్నాడట. ఒక ఎన్నికల అధికారి భారతదేశం లో ఉన్న ఎన్నికల వ్యవస్థలో ఎలాంటి విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా స్టోరీ కి స్ఫూర్తి టీయెన్ శేషన్ అట. ఎన్నికల అధికారిగా ఆయన సమాజం లో తీసుకొచ్చిన మార్పులు సాధారమైనవి కావు.
ఆయన కారణంగానే ఎన్నికలలో డబ్బు ప్రవాహం అనేది అనేక ప్రాంతాలలో బాగా తగ్గిపోయింది. ఆయన జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ శంకర్. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ టీజర్ లో సినిమా విడుదల తేదీ కూడా ఉంటుందట.