Naresh Pavitra : విడిపోతున్న నరేష్ పవిత్ర.. ఆయన పోస్టుకు అర్థం అదేనా ?

- Advertisement -

Naresh Pavitra : నరేష్, పవిత్ర లోకేష్ ఈ పేర్లతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలంగా వీళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కు గురయ్యాయో చూస్తూనే ఉంటున్నాం. అయితే గత కొన్ని రోజులుగా ఈ పేర్లు కాస్త సైలెంట్ అయిపోయాయి. కాగా తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చేసిన ట్వీట్ తో మరొకసారి వీళ్ల పేర్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. అయితే ఆయన ఓ విషయం కారణంగా ట్వీట్ చేస్తే సోషల్ మీడియాలో ఆకతాయిలు మాత్రం ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

నరేష్ పవిత్రల బంధం గురించి అందరికీ తెలిసిందే. లేటు వయసులో పుట్టిన ఘాటు ప్రేమగా చెప్పుకోవాలి. అయితే తాజాగా నరేష్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు . “బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి ..ఈ ఎండవేడికి కార్ వ్యాన్ లోని ఏసీలు కూడా పనిచేయడం లేదు .. కొన్ని మూవీ యూనిట్లు షూటింగులు కూడా క్యాన్సిల్ చేసుకున్నాయి. అంత వేడిగా ఉంది .. సో మిత్రులారా రాబోయేది కొద్ది రోజులు మరింత దారుణంగా ఉంటాయి.. కాబట్టి మీరు అవసరమైతేనే బయటకు వెళ్లండి.. లేకపోతే ఇంట్లోనే ఉండండి ..మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి “అంటూ రాసుకొచ్చారు.

- Advertisement -

అలాగే జీవితం పర్ఫెక్ట్ గా లేదు అయినప్పటికీ మీరు పర్ఫెక్ట్ మూమెంట్స్ తో నింపండి అంటూ ఓ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొంతమంది పవిత్రతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా.. అనే విధంగా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు కొంతమంది రెచ్చిపోయి నువ్వు పవిత్రతో కూడా డివోర్స్ తీసుకుంటున్నావా ఏంటి..? అంటూ కూడా దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సైలెంట్ గా ఉన్న నరేష్ ని కావాలనే ఇలా చేస్తున్నారు కొందరు ఆకతాయిలు అంటూ నరేష్ అభిమానులు కూడా రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు..!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here