దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం నేడు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యారగిరిలో ‘నాటు నాటు’ పాటకి గాను ఆస్కార్ అవార్డుని గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే.నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న ఈ సాంగ్ కి హాలీవుడ్ సినిమాలను దాటి ఆస్కార్ అవార్డుని గెలుచుకుంటుందా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉండేది.కానీ ఆ సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ ఈ పాటకి ఆస్కార్ అవార్డు రావడం ప్రపంచ నలుమూలల్లో ఉన్న భారతీయులకు ఎంతో గర్వకారణం గా నిల్చింది.

ఇక మన తెలుగు వాళ్లకి ఏ రేంజ్ గర్వం గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మనం ఎంతగానో ఇష్టపడే ఇద్దరు హీరోల కష్టానికి తగిన ఫలితం ఈ రేంజ్ లో దక్కడం అనేది నిజం గా ఎవ్వరూ ఊహించనిది.అయితే ఆస్కార్ అవార్డు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఆ రేంజ్ లో డ్యాన్స్ వేసి ఉండకపోతే వచ్చి ఉండేదా?.

‘నాటు నాటు’ పాట అద్భుతమైన పాటనే, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ దానికి మించిన అద్భుతమైన పాటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి.కానీ వాటికి రాని అవార్డు నాటు నాటు పాటకి వచ్చిందంటే రామ్ చరణ్ – ఎన్టీఆర్ వేసిన అద్భుతమైన డ్యాన్స్ మూవ్మెంట్స్ వల్లే.కానీ కేవలం కీరవాణి మరియు చంద్రబోస్ కి మాత్రమే అవార్డు ఇవ్వడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు.ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన ప్రతీ ఒకరికి ఒక అవార్డు ఇచ్చి ఉంటే అందరూ ఎంతో సంతృప్తి చెందేవాళ్ళు.

అయితే ఈ పాటకి ఇలాంటి అద్భుతమైన గౌరవం దక్కడానికి మొదటి కారణం డైరెక్టర్ రాజమౌళి..ఆయన విజన్ లేకపోతే ఇదంతా సాధ్యపడేది కాదు, ఇక ఆ తర్వాత హీరోలిద్దరిదీ.అంత ఫాస్ట్ బీట్ మూవ్మెంట్స్ ని అన్ని సార్లు రిహార్సల్స్ చేసి వెయ్యడం అనేది సాధారణమైన విషయం కాదు.ఇక ఆ తర్వాత ఇంత అద్భుతమైన స్టెప్స్ ని కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి కూడా సింహభాగం క్రెడిట్ దక్కుతుంది.ఈ నలుగురి తర్వాతే కీరవాణి మరియు చంద్రబోస్ అని మా అభిప్రాయం,మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్స్ లో తెలియజెయ్యండి.
