Janhvi Kapoor : ప్రతి రోజు అది చూసుకోనిదే…జాన్వీ అడుగుకూడా బయటపెట్టదట.. ఇదేం పిచ్చి

- Advertisement -

Janhvi Kapoor: జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత అతిలోక సుందరి శ్రీదేవీ కూతురిగా అందరికి సుపరిచితురాలే. బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అక్కడ పలు సినిమాలు చేసినప్పటికీ తన కేరీర్ కు ఉపయోగపడే క్రేజీ హిట్ మాత్రం కొట్టలేకపోయింది . ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆశలన్నీ టాలీవుడ్ పైనే పెట్టుకుంది. తాను ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారానే తెలుగుకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే మరొక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వీ కపూర్.

రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వం లో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమె తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టింది . తాను జ్యోతిష్యాలను బాగా నమ్ముతానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఉదయం నిద్ర లేస్తే మొదటగా తన రాశి ఎలా ఉంది.. ఈ రోజు ఏం జరగబోతుందన్న విషయాన్ని చూయించుకుంటుందట. ఆ తర్వాతే తన డేని మొదలు పెడుతుందట. కొన్నిసార్లు తన రాశి బాగోలేదు అన్నప్పుడు అప్రమత్తమై చాలా జాగ్రత్తగా ఉంటుందట.

- Advertisement -

తన రాశిలో జరిగిన విధంగానే తన జీవితంలో జరుగుతుందని నమ్మకం జాన్వీ కపూర్‎కి ఉంటుందట. అందుకే ప్రతి రోజు తన జాతకాన్ని.. తన రాశి ఎలా ఉందనే విషయాన్ని చెక్ చేసుకుంటుందట. సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఇలాంటివి నమ్మరు.. ఒకవేళ నమ్మిన బయటకు చెప్పరు.. కానీ జాన్వీ కపూర్ మాత్రం ఇలా ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసింది. దీనితో సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ పేరు మారుమ్రోగిపోతుంది..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here