JR NTR గురించి పరిచయాలు అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. కొరటాల శివ కాంబోలో దేవర సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎటువంటి పాత్రనైనా.. ఎలాంటి డైలాగ్ అయినా అలవోకగా నటించగలిగే ఎన్టీఆర్ కు ఓ డ్రీమ్ రోల్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పటివరకు ఆ రోల్లో నటించే అవకాశం ఎన్టీఆర్‌కు రాలేదట.

ఒకవేళ అవకాశం వచ్చిన చేయడానికి ఆయనకు కాస్త భయమట. ఇంతకీ ఆ రోల్ ఏంటి.. ఆ రోల్‌లో నటించడానికి ఎన్టీఆర్ ఎందుకు అంత భయపడడానికి కారణమో ఓ సారి చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాముడు, కృష్ణుడు అనగానే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. తాతలానే ఎన్టీఆర్‌కు కూడా కృష్ణుడి పాత్రలో నటించాలన్నది ఎప్పటి నుంచో డ్రీమ్ అట. అయితే ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో నటించే అవకాశం మాత్రం ఆయనకు ఇప్పటి వరకు రాలేదట.

ఒకవేళ వచ్చినా ఆ పాత్ర చేయటానికి కాస్త భయపడతాడట ఎన్టీఆర్. దానికి కారణం కృష్ణుడి పాత్రలో తన నటనలో ఏ కాస్త లోపం ఉన్న తాత పేరు చెడగొట్టిన వాడిగా మిగిలిపోతాను.. తన నటనలో 100శాతం ఇవ్వాలి అందుకే.. కాస్త వెనకడుగు కూడా వేస్తానని చెప్పుకొచ్చాడట. ఇక ఒకవేళ ఆ అవకాశం వస్తే ప్రాక్టీస్ చేయడానికి కాస్త టైం తీసుకుని అయినా పర్ఫెక్ట్ గా చేయాలన్నది ఎన్టీఆర్ భావన.