Naveen Chandra: నానిని మాస్ హీరోగా చేసిన మూవీ “నేను లోకల్” మూవీ. ఈ మూవీకి చాలా ఫ్యాక్టర్స్ సెట్ అయ్యాయి. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్, రైటర్ ప్రసన్న, డైరెక్టర్ , ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇలా చాల విషయాలు ఈ మూవీని హిట్ చేశాయి. వీటిలో ఇంకో బెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే నవీన్ చంద్ర. ఈ మూవీ నవీన్ చంద్ర కొంచెం విలన్ షెడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. నవీన్ తనకిచ్చిన క్యారెక్టర్ ను చాల పర్ఫెక్ట్ గా చేశాడు. నవీన్ చాలా గ్రేట్ యాక్టర్ కాబట్టి అవతలి వాళ్ళను ఈజీగా డామినెటే చేసెయ్యగలడు. పైగా మంచి పర్సనాలిటీ కూడా ఉంది కాబట్టి యిట్టె అందరిని అట్ట్రాక్ట్ చేస్తాడు.

అయితే ఈమూవీలో కూడా ముందు నవీన్ పై చాల సీన్స్ షూట్ చేశారు కానీ తరువాత వాటిని మూవీ నుండి తీసేశారని నవీన్ చంద్ర పర్మిట్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. అయితే తనను డామినెటే చేశానని నానినే ఆ సీన్స్ తీయించేశాడని నవీన్ అనుకోని చాలామంది దగ్గర ఈ విషయాన్ని షేర్ కూడా చేసుకున్నాడట. అయితే తరువాత మూవీలో ఆ సీన్స్ సెట్ కాకపోవడం వల్లే వాటిని తీసేశారని తనకు తెలిసిందని నవీన్ వివరించాడు.

అయితే వేరే యాక్టర్ సీన్స్ ను కట్ చేయించేంత ఇన్సెక్యూర్ యాక్టర్ మాత్రం నాని కాదు. చాల మూవీస్ లలో స్టోరీని ముందు పెట్టి, తానూ బ్యాక్ సీట్ తీసుకున్న మూవీస్ ఎన్నో ఉన్నాయ్. కాబట్టి నాని అలా చేసి ఉండదని నాని ఫ్యాన్స్ చెప్తున్నారు. నవీన్ కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి యాక్టర్ గా బెటర్ పోసిషన్ లో ఉన్నాడు.