Lal Salaam : గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రం తో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన కళ్లారా చూసాము. రజినీకాంత్ సినిమాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ అవుతున్నాయి, ఇక ఆయన పని అయిపోయినట్టే అని కామెంట్స్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటోళ్ళ నోర్లను మూయించింది జైలర్ చిత్రం. సుమారుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వసూళ్లను ఒక్క స్టార్ హీరో కూడా అందుకోలేకపోయాడు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లియో’,’సలార్’ చిత్రాలు కూడా ఈ సినిమా వసూళ్లను అందుకోలేకపోయాయి. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ ఏ చిత్రం చెయ్యబోతున్నాడు అనే ఉత్కంఠ ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకుల్లో కూడా ఉండేది. ఆ సమయం లో ఆయన ‘లాల్ సలాం’ చిత్రం లో నటిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన జరిగింది. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ హీరో కాదు,కేవలం ఒక ముఖ్య పాత్ర మాత్రమే చేస్తున్నాడు.
అంటే ‘బ్రో’ చిత్రం లో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ లాగ అన్నమాట. ఈ సినిమాలో హీరోలుగా విష్ణు విశాల్, విక్రాంత్ లు నటించగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. ఫిబ్రవరి 9 వ తారీఖున తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే ఈ సినిమాలో రజినీకాంత్ పాత్ర కోసం ముందుగా మెగాస్టార్ చిరంజీవి ని అడిగిందట ఐశ్వర్య.
కథ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి, ఇలాంటి సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తే ఫ్యాన్స్ అంగీకరించారు అనే ఉద్దేశ్యం తో చిరంజీవి ఈ సినిమాని సున్నితంగా రిజెక్ట్ చేసాడు. ఆ తర్వాత ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్న ఐశ్వర్య ని చూసి, నేను చేస్తాను ఈ సినిమా, డేట్స్ ఎప్పుడు కావాలో అడుగు అని రజినీకాంత్ అన్నాడట. అలా ఈ ప్రాజెక్ట్ చిరంజీవి చేతుల నుండి రజినీకాంత్ చేతుల్లోకి వెళ్ళింది.