Narasima : హీరోయిన్ ని మార్చలేదని ‘నరసింహా’ చిత్రాన్ని మిస్ చేసుకున్న తెలుగు స్టార్ హీరో అతనేనా?

- Advertisement -

Narasima : సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘నరసింహ’ అనే చిత్రం. అప్పట్లో ఈ సినిమా తమిళం లో ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో, తెలుగు లో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రజినీకాంత్ కి ఈ చిత్రం తెలుగు లో మన స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ని తెచ్చిపెట్టింది. అప్పుడు వచ్చిన మార్కెట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

మధ్యలో ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా తెలుగు లో రజినీకాంత్ ఇమేజి చెక్కు చెదరలేదు. తమిళ హీరో సినిమాని తెలుగు దబ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఆడింది అంటే, ఇక తెలుగు హీరో చేసి ఉంటే ఏ రేంజ్ లో ఆడి ఉండేదో ఊహించుకోవచ్చు. ఈ సినిమాని ముందుగా తెలుగు లో ఒక స్టార్ హీరో తో రీమేక్ చేద్దాం అనుకున్నారు.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు, నందమూరి బాలకృష్ణ. ఒక ప్రముఖ నిర్మాత రీమేక్ రైట్స్ ని కూడా కొనుగోలు చేసాడు. బాలకృష్ణ కి ఈ స్టోరీ వినిపించగా ఆయనకీ తెగ నచ్చేసింది. అయితే తెలుగు లో కూడా తమిళం లో నెగటివ్ రోల్ చేసిన రమ్య కృష్ణ నే ఈ సినిమాకి కూడా తీసుకోండి అని అన్నాడట బాలయ్య. రమ్య కృష్ణ డేట్స్ కోసం ప్రయత్నం చేసారు కానీ, ఆమెవి అందుబాటులో లేవు. దీంతో ఆమె బదులు అప్పటి హాట్ హీరోయిన్ రంభ ని తీసుకుందాం అనుకున్నారు.

- Advertisement -

రంభ కి అప్పట్లో యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో మన అందరికీ తెలిసిందే. అప్పటి వరకు విలన్ రోల్స్ లో ఎన్నడూ చెయ్యని రంభని జనాలు ఎలా తీసుకుంటారో అని భయపడి, బాలయ్య నో చెప్పాడట. కానీ రంభ కి మాత్రం ఆ నెగటివ్ రోల్ చెయ్యాలని చాలా కోరికగా ఉన్నింది అట, కానీ బాలయ్య ఒప్పుకోలేదు. రమ్య కృష్ణ డేట్స్ సర్దుబాటు అయ్యే వరకు వేచి చూద్దాం అని బాలయ్య అన్నాడట. కానీ చివరికి ఈ చిత్రాన్ని తెలుగు లో డబ్ చేసి వదిలారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here