గోవా బ్యూటీ Ileana కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.. ఆమె అందం, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. కెరియర్ మొదట్లో వరుస హిట్ సినిమాలను తన లిస్ట్ లో వేసుకుంది.. బాలివుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్కడ కూడా హిట్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది.. లవ్ ఏఫైర్ తో సినిమాలకు దూరం అయ్యింది..అయితే ఆమె సినిమాల్లో కనిపించక పోవడానికి బలమైన కారణం కూడా ఉందట.. ఓ సినిమా కోసం బడా నిర్మాత హీరోయిన్గా ఫిక్స్ చేశారట.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడంతో డబ్బులను ఇవ్వాలని కోరగా దానికి ఇలియానా నో చెప్పడంతో ఇండస్ట్రీలోనే బ్యాన్ చేశారు.. అలా ఆమె సినీ కేరీర్ మధ్యలోనే ఆగిపోయిందట..

దేవదాసు సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన ఈమె పోకిరి సినిమాతో తన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. సౌత్ లో కోటి రూపాయల పారిపోషకం తీసుకున్న హీరోయిన్ కూడా ఈమె. మరొకవైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది అక్కడ కూడా అన్ని సూపర్ హిట్ విజయం సాధించాయి కానీ ఈమె అనుకున్నంత స్థాయిలో బాలీవుడ్ లో రాణించలేదు. ఇటు సౌత్ లో కూడా కనిపించలేదు.. అసలు విషయం ఏమిటంటే దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలో ఇలియానా ఒక కోలీవుడ్ సినిమాకు సైన్ చేసింది…

విక్రమ్ హీరోగా కోలీవుడ్ నిర్మాత నటరాజ్ నందం అనే సినిమాను ప్లాన్ చేశాడు.. ఈ సినిమాలో ఇలియానా కోసం హీరోయిన్గా 40 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. దాంతో నిర్మాత నటరాజు అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిందిగా ఇలియానా ను కోరగా.. అందుకు ఆమె అంగీకరించలేదు…

ఇండస్ట్రీ పెద్దలతో చెప్పినా కూడా ఆమె ఇవ్వడానికి నో చెప్పడంతో ఆమెను బ్యాన్ చేసారని వార్తలు వచ్చాయి.. డబ్బులు ఇచ్చే వరకు సౌత్ సినిమాల్లో తీసుకోకూడదు అని నిర్ణయించారు. అందువల్లే సౌత్ సినిమాలకు దూరం అయింది అని వార్తలు వెలుబడుతున్నాయి.. ఇకపోతే ఇలియానా ఈ సమస్యను సాల్వ్ చేసిందట.. అందుకే ఇప్పుడు సినిమాల్లో ఇలియానా మళ్ళీ బిజీ అవ్వనుంది..
మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఇంస్టాగ్రామ్ పేజీ ని ఫాలో అవండి