Neha Shetty : ప్రేమలో మునిగి తేలుతున్న డిజే టిల్లు గాడి లవర్.. అబ్బా లక్కీ ఫెలో

- Advertisement -

Neha Shetty అంటే పెద్దగా తెలియకపోయినా డీజే టిల్లు హీరోయిన్ రాధిక అంటే మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపడుతారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతుంది. వాస్తవానికి కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ మెహబూబా సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫస్ట్ సినిమా సక్సెస్ కాలేకపోయినా… డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాలో రాధిక పాత్ర జనాల నోళ్లలో నాటుకుపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వెలువెత్తాయి.

Neha Shetty
Neha Shetty

తాజాగా ఆమె కార్తికేయ తో బెదురులంక-2012 సినిమాతో వచ్చి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చేస్తోంది. వెండి తెరపైనే కాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది. రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా నేహా శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సమయంలో యాంకర్ మీరు ప్రేమలో ఉన్నారా.. మీకు ఎప్పుడైనా ఎవరైనా లవ్ ప్రపోజ్ చేశారా అని అడిగాడు. అతడెవరో చెప్పండి అంటూ యాంకర్ అడుగగా చెప్పకుండా నవ్వుతూ మాట దాటేసింది. అయితే మీ ఫ్యాన్స్ లో ఉండే ప్రేమ గురించి చెప్పండి అంటే .. నేహా శెట్టి.. లవ్ లో ఎలాంటి రూల్స్ ఉండవు.. మనమే రూల్స్ పెట్టుకుంటాం. కానీ ఫాలో అవ్వము.. లవ్ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్.. ఎంతో హ్యాపీ ఉంటుంది. దానిలో రూల్స్, హద్దులు ఉండవు.. చాలా బాగుంటుంది. అని తెలిపింది. నేహా శెట్టి చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమ్మడు కచ్చితంగా ప్రేమలో ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here