Anil Ravipudi : ఫ్లాప్ లేని డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అనిల్ రావిపూడి సడెన్ గా ఝలక్ ఇచ్చాడు. పాలిటిక్స్ లో కి వెళ్తున్నట్లు తెలిపాడు. దీనిపై సోషల్ మీడియాలో వీడియోని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. మూవీల్లో లాగానే.. పాలిటిక్స్ లోకి వెళ్తున్న తనను ఎంకరైజ్ చేయాలని కోరాడు.
ఈ వీడియోలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, నేను డైరెక్ట్ చేశాను, మీరు హిట్ చేశారు. నేను ఎంటర్టైన్ చేశాను, మీరు ఎంటర్టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరే. కానీ ఈ సారి నా గెలుపు థియేటర్లో కాదు, ఓ అసెంబ్లీ, ఓ పార్లమెంట్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. పంపిస్తారుగా, పంపిస్తారు లే. బాక్సాఫీసు సక్సెస్ చూసిన నాకు బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలని ఉంది.అదేనండి మనం పార్టీ పెట్టబోతున్నాం. మన పార్టీ పేరేంటో, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం సమాచారంతో త్వరలో వస్తాను` అని అన్నాడు.
పొలిటికల్ లీడర్ గెటప్ లో ఈ వీడియోను రిలీజ్ చేశాడు అనిల్ రావిపూడి. కాగా ఇదంతా ఆహా ఓటీటీ కోసం అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలక్షన్స్ దగ్గరుండటంతో.. ఆ కాన్సెప్ట్ తో ఓ షో చేయనున్నట్లు సమాచారం. అందుకోసమే పొలిటికల్ లీడర్ గెటప్ లో అనిల్ రావిపూడి ప్రోమో వదిలారని టాక్. మరోవైపు.. తన డైరెక్షన్ లో ఇటీవలే విడుదలైన భగవంత్ కేసరి సక్సెస్ అయ్యింది. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జోష్ లో ఉన్నాడు.
అదండి మేటర్ మరి!😌
— ahavideoin (@ahavideoIN) November 17, 2023
మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకీ..💁🏻♂️@AnilRavipudi pic.twitter.com/Q0gL9rnsfN