Aishwarya Rai – Abhishek Bachchan ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బ్లూ ఐస్ తో చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటుంది..ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు కొన్ని దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఆమె వన్నెతెరగని అందంతో ఇంకా అంతే జోష్తో దూసుకుపోతున్నారు అంటే ఇక ఈమె స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.. అయితే ఈ మధ్య వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని బాలివుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
2007లో వీరి వివాహం అతి సన్నిహితుల మధ్య ఘనంగా జరగగా.. 2011లో పాప పుట్టింది.. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టుకున్నారు. ఒకరకంగా వీరిద్దరిది అటు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా క్యూట్ పెయిర్ గా వర్ణిస్తూ ఉంటారు. అలాంటి ఈ జంట ఇప్పుడు విడిపోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ జంట విడిపోతోంది ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి అంటూ ఇప్పుడు సరికొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.. అసలు విషయం ఏంటో వారిద్దరూ చెప్పలేదు..
ఇలా అనుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి.. వీరిద్దరూ కలిసి బయట కనిపించి చాలా కాలమే అయ్యింది. ఇటీవల నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ సేర్మనీకి కూడా ఐశ్వర్యరాయ్ తన కుమార్తె ఆరాధ్యతో మాత్రమే కలిసి వచ్చింది. అమితాబ్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య ఆ ఫంక్షన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే వారిద్దరూ వచ్చారని సంబరపడే అభిమానుల కంటే అభిషేక్ ఎందుకు రాలేదని ఆరా తీసే అభిమానులే ఎక్కువ అయ్యారు.. అసలు అభిషేక్ ఎందుకు రాలేదు..ఆయనకు ఏదైనా పని ఉందా? లేక భార్యతో కలిసి రావడం ఇష్టం లేదా? అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని సంవత్సరాలు సంతోషంగా ఉన్న ఈ జంట ఇప్పుడు ఎందుకు విడిపోతారు అని కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి దీనిపై బచ్చన్ ఫ్యామిలీ క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి..