Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఓ యాంకర్ గా, హీరోయిన్ గా, నిర్మాతగా రాణించింది ఈ ముద్దుగుమ్మ. తాను నటనకు దూరంగా ఉండి పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. మొదట బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించిన ఈ బ్యూటీ తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుని పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తు పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలువలేదు. ఇటీవల వీరిద్దరూ డివోర్స్ తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.
చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. పలు వెబ్ సిరీస్‌లలో నటించడమే కాకుండా నిర్మాత గా కూడా మారి బిజీ అయిపోయింది. ఇలా వెబ్ సిరీస్ నిర్మాతగా సక్సెస్ అందుకున్న నిహారిక ప్రస్తుతం ఓ సినిమాను కూడా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ తానే దగ్గరుండి చూసుకుంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు మీరు ఫస్ట్ టైం ఎప్పుడు మేకప్ వేసుకున్నారు అంటూ ప్రశ్న అడగగా నేను ఢీ షో కోసమే నా మొదటి మేకప్ ను వేసుకున్నానని చెప్పింది.
ఆ షో నాకు ఎప్పటికీ చాలా మెమొరబుల్ అంటూ చెప్పుకొచ్చింది. ఈమె చిన్నప్పుడు ఎప్పుడైనా విలువైన వస్తువులను పోగొట్టుకుని బాధపడ్డారా అని అడగగా.. ఆ విషయంలో మనమే ఫస్ట్ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. చిన్నప్పుడు అమ్మ తన కోసం ఎన్నో రకాల డిజైనర్ జ్యూయలరీ తెచ్చిపెట్టేదని.. నేను వాటిని చాలా పోగొట్టానని ముద్దుగుమ్మ తెలిపింది. తాను ఇప్పటివరకు పోగొట్టుకున్న బంగారంతో ఓ ఇల్లు ఈజీగా కట్టేయొచ్చు అంటూ నిహారిక చెప్పింది. నేను పెట్టుకున్న నగలు ఉన్నాయో లేదో కూడా గమనించుకునే దాన్ని కాదంటూ నిహారిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.