సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు ” నాని “. అష్టా చమ్మా సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాని నటించిన సినిమాలు వరుసగా హిట్ అవటంతో టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఎందరికో ఆదర్శం అని చెప్పాలి.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న నాని కి టెక్నాలజీ ని ఉపయోగించటం ఇప్పటికీ సరిగా తెలియదట. ప్రస్తుత కాలంలో మొత్తం డిజిటల్ అయిపోతున్న తరుణంలో బ్యాంకింగ్ సేవల కోసం ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే బాగా ఉపయోగిస్తున్నారు. అయితే నాని కి మాత్రం ఇప్పటికీ ఫోన్ పే యూజ్ చేయడం రాదంట. ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ యాప్ లలో ఫుడ్ ఆర్డర్ పెట్టడం కూడా తెలియదని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాను టెక్నికల్లీ హ్యాండీక్యాప్డ్ అని, ఫోన్ పే, గూగుల్ పే వాడడం కూడా రాదని, కనీసం ఫుడ్ ఆర్డర్ ఎలా పెట్టాలో కూడా తెలియదని స్వయంగా తానే దసరా మూవీ ప్రమోషన్స్ లో బయటపెట్టాడు.

నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. సింగరేణి నేపథ్యంలో తెరకిక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో నాని, కీర్తి సురేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ధరణి గా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అనేక మంది సినీ ప్రముఖులు దసరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడి తొలి చిత్రమైనా శ్రీకాంత్ ఓదెల పనితీరుకు ప్రశంసలు అందాయి. నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా దసరా నిలిచింది. ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
