పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘మెగాస్టార్’ చిరంజీవి సోదరుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా.. ఆ ప్రభావం ఎక్కడా కనబడనీయలేదు. తన నటన, మేనరిజం, డ్యాన్స్‌తో ప్రేక్షుకులను అలరించారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. ‘పవర్ స్టార్’ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.. ఓ సెన్షేషన్. ఆయన అంటే పడిచచ్చేవారు వారు ఎందరో ఉన్నారు.
నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ ‘బర్త్ డే’. ఈ సందర్భంగా పవర్ స్టార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. చదువుపై పెద్దగా ఆసక్తి లేని పవన్ ఇంటర్‌తో చదువును ఆపేశారు. ఆపై మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. ‘కళ్యాణ్ బాబు’ అనే పేరును ‘పవన్ కళ్యాణ్’గా మార్చుకొని 1996లో సినీరంగ ప్రవేశం చేశారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నారు.
ఇక ‘తొలిప్రేమ’ సినిమాతో స్టార్ అయ్యారు. తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు ఆయనను ‘పవర్ స్టార్’ను చేశాయి. జల్సా సినిమా పవన్ కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. గుడుంబా శంకర్, జానీ, బాలు, పంజా, తీన్మార్, బంగారం, అన్నవరం, రాంబాబు లాంటి ఎన్నో పరాజయాలు ఎదురైనా.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. గబ్బర్ సింగ్ సినిమాతో చాలా ఏళ్లకు పవన్ భారీ హిట్ కొట్టారు. సినిమాకు తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. ‘అత్తారింటికి దారేది ‘సినిమా వసూళ్లలో అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.
‘అజ్ఞాతవాసి’ అంనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్.. తాజాగా బ్రో సినిమాతో తన సత్తా చాటారు. పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు నిర్మాతగానూ వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై సినిమాలు చేసారు. ముగ్గురు మొనగాళ్లు, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడి మారి జానీ సినిమా తీశారు. ఇక తన సినిమాలు కొన్నింటికి స్టంట్స్ మాస్టర్‌గానూ పని చిహ్సారు. జానీ, గుడుంబా శంకర్, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథా సహకారం అందించారు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.