Indraja: ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్ల హావా నడుస్తుందన్న సంగతి తెలిసిందే.. ఎవరికీ వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోయిన్లతో పోటి పడి మరీ అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీస్తున్నారు.. ఇక విషయానికోస్తే.. ఇటీవల విడుదకైనా నాని దసరా సినిమాలోని చమ్కీల అంగీలు వేసి పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ పాట వినిపిస్తే కాలు కదపని వాళ్ళు లేరని చెప్పాలి..ఊర మాస్ బీట్ కి కీర్తి సురేష్ వేసిన డ్యాన్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ బిట్ కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది… తాజాగా ఈ పాటకు సీనియర్ నటి ఇంద్రజ మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

ప్రతీ ఆదివారం ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కి జడ్జి గా ఇంద్రజ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాం కూడా పెద్ద హిట్ అయ్యింది..వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ ప్రోమోను తాజాగా ఈటీవీ విడుదల చేసింది..ఇందులో ఇంద్రజ దసరా చిత్రం లో కీర్తి సురేష్ డ్యాన్స్ వేసిన బిట్ ని మరో రీ క్రియేట్ చేసింది. ఇంద్రజ డ్యాన్స్ ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ వయస్సు లో కూడా కీర్తి సురేష్ కంటే స్పీడ్ గా, ఎంతో అందంగా డ్యాన్స్ చేసారని అందుకే ఇప్పటికి ఈమెకు డిమాండ్ ఉందని కామెంట్లు పెడుతున్నారు..
ఒకప్పుడు ఇంద్రజ మాస్ టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది..అప్పట్లో యూత్ మొత్తం ఈమె అంటే పడి చచ్చిపోయేవారు. అయితే పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఇంద్రజ, ఆ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ బిజీ గా మారింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఇలా బుల్లితెర మీద కనిపిస్తూ హవాను కొనసాగిస్తుంది.. ప్రస్తుతం ఇంద్రజ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒక లుక్ వేసుకోండి..