Indraja : దయచేసి ఆడవారిని ఆ పనికి మాత్రం వాడుకోవద్దు.. ఇంద్రజ హాట్ కామెంట్స్

- Advertisement -

Indraja : ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ల హంగామా నడుస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీని తమ గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లు.. వారి వారి జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు లాంటి ఘట్టాలను దాటి.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చింది. అమాయకత్వంగా కనిపిస్తూనే కౌంటర్లు వేస్తూ జబర్దస్త్ జడ్జిగా ఫిక్స్ అయిపోయింది.

indraja
indraja

ఇంకోపక్క శ్రీదేవి డ్రామా కంపెనీ షో కు అయితే పర్మినెంట్ జడ్జిగా కూడా మారిపోయింది. ఇంద్రజ జడ్జిమెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో భాను సాంగ్ కు కామెంట్స్ ఇచ్చినప్పుడే తెలిసిపోయింది. అప్పుడు ఆమెను ఎంత డెప్త్ గా ట్రోల్ చేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా మహిళా దినోత్సవ వేడుకలను శ్రీదేవి డ్రామా కంపెనీ లో నిర్వహించారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు.దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న మహిళలకు నివాళులు అర్పించారు.

ఇక ఈ ఈవెంట్ లో ఇంద్రజ మగవారికి ఒక విజ్ఞప్తి చేసింది. బూతులు తిట్టడానికి ఆడవారిని అడ్డం పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ‘‘దయచేసి బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోకండి. మగాళ్లు.. మగాళ్లు కొట్టుకుంటున్నారా.. ? మీ పేర్లతోనే తిట్టుకోండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఇంద్రజ ప్రస్తుతం.. ఈ షోస్ లోనే కాకుండా కూడా కీలక పాత్రల్లో నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here