Vijay Devarakonda : ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్..ఈసారి సంక్రాంతికి కొడితే కుంభస్థలమే!

- Advertisement -

Vijay Devarakonda : ఈ ఏడాది ‘ఖుషి’ చిత్రం తో కూల్ హిట్ ని అందుకున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది . గతం లో పరశురామ్ పెట్ల దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

Vijay Devarakonda
Vijay Devarakonda

మీడియం రేంజ్ హీరోలలో ఇప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ లాగ నిల్చింది. ఈ సినిమా తర్వాతనే విజయ్ దేవరకొండ కి పది ఫ్లాప్స్ పడినా చెక్కు చెదరని యూత్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. మళ్ళీ అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. టీజర్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ దమ్ము, తెగింపు మరియు ధైర్యం ఉన్న సాధారమైన మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడిగా నటించాడు. టీజర్ మొత్తం బాగానే ఉంది కానీ, విజయ్ దేవరకొండ డైలాగ్ మోడ్యులేషన్ లో ఏమాత్రం మార్పు లేనట్టుగా అనిపించింది.

- Advertisement -

ప్రతీ సినిమాలోనూ ఆయనకీ తెలంగాణ స్లాంగ్ వచ్చేస్తుంది. పాత్రకి తగ్గట్టుగా డైలాగ్ డెలివరీ ఉండడం లేదు. ఇదొక్కటే ఆయనలో ఉన్న మైనస్. ఇక ఈ చిత్రం లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈమె కూడా టీజర్ లో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి భార్య లాగ సహజంగా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆడియన్స్ కి కచ్చితంగా గుంటూరు కారం చిత్రం తర్వాత ఇదే ఛాయస్ అవుతుందని ఈ టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here