Imanvi Esmail : ప్రభాస్ కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్.. ఈ ఫొటోలు చూశారా

- Advertisement -

Imanvi Esmail.. ఇప్పుడు టాలీవుడ్ లో చర్చంతా ఈ భామ గురించే. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, యూట్యూబర్, రీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఫేట్ నైట్ నైటుకే మారిపోయింది. ఒక్కసారిగా ఇండియా మొత్తం ఈ భామ ఎవరు అనే దాని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. దానికి గల కారణం.. ఇమాన్వీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే ఛాన్స్ కొట్టేయడం.

రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటు ఇమాన్ కూడా పాల్గొంది. ఇక ఈ జంట ను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఈవెంట్ కు చీరకట్టులో వచ్చిన ఇమాన్వీ ని చూసి న్యూ పెయిర్ ఇన్ టౌన్ అంటూ ట్రెండ్ మొదలు పెట్టారు.

- Advertisement -

అలాగే ఇమాన్వీ ఎవరంటూ ఈమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఆమె ఇన్ స్టాగ్రామ్ కు ఒక్కసారిగా రిక్వెస్టుల ఫ్లో పెరిగిపోయింది. ఒక్కసారిగా ఈ భామకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈమె సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి ఈమె గురించి వెతకడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చంతా ఇమాన్వీ గురించే జరుగుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here