స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో గర్భం దాల్చిన ఇలియానా.. అతన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్..!

- Advertisement -

‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఇలియానా. జీరో సైజ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచిన ఈ గోవా బ్యూటీ తన నటన, అందంతో ప్రేక్షకుల హృదయాల్లో చరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత వరుస విజయాలు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తెలుగు, హిందీలో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. 2018లో విడుదలైన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలియానా 36 ఏళ్ల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఇటీవల తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చారు.

ఇలియానా
ఇలియానా

ఇలియానా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తర్వాత కొద్దిరోజుల పాటు ఆమె విషయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంత వరకు తను ఎవరి వల్ల గర్భవతి అయ్యాననే విషయాన్ని ఇలియానా రహస్యంగానే ఉంచింది. తాజాగా ఆ వ్యక్తి గురించి మెుదటిసారి రివీల్‌ చేసింది ఇలియానా. ఆ వ్యక్తి గురించి ఎమోషనల్‌గా పోస్ట్‌ చేస్తూ కొన్ని విషయాలు వెల్లడించింది.

తల్లి కావడమనేది అందమైన అనుభూతిగా వర్ణించిన ఆమె ఈ అదృష్టాన్ని తన జన్మలో పొందుతానని అనుకోలేదని తెలిపింది. తనలో ఒక జీవి ప్రాణం పోసుకుంటుందనే అనుభూతిని మాటల్లో వర్ణించలేనంత మనోహరంగా ఉందని చెప్పింది. అలాగే తన జీవితంలో కొన్ని కష్టమైన రోజులు ఉన్నాయని వాటిని నుంచి బయటకి రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నానని వెల్లడించింది. కన్నీళ్లు తుడుచుకుని తనకి తానే ధైర్యం చెప్పుకుంటున్నానంది. తన గురించి తానే మర్చిపోతున్న రోజుల్లో ఓ వ్యక్తి తనకు అండగా నిలిచాడని ప్రియుడిని ఉద్దేశిస్తూ భావోద్వేగానికి గురైంది ఇలియానా. ఆ వ్యక్తి కన్నీళ్లు తుడిచి చిరునవ్వులు పూయించాడని తనకి ఎప్పుడు ఏం కావాలో అర్థం చేసుకుని తోడుగా నిలిచాడని చెప్పుకొచ్చింది. అస్పష్టంగా ఆ వ్యక్తి ముఖాన్ని ఇలియానా రివీల్ చేసింది.

- Advertisement -

కాగా, ఇలియానా.. బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్‌తో సహజీవనం చేసి గర్భం దాల్చారని రూమర్స్‌ వస్తున్నాయి. కానీ దీనిపై స్పష్టత లేదు. దీనిపై ఆమె త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here