Ileana : ఇలియానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే అందరి చూపును తనవైపు లాక్కుంది.. స్టార్ హీరోల సరసన నటించి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. అయితే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరం ఉండి, బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుంది.. అయితే రవి తేజ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు ఆ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వలేక పోయింది.. దీంతో సోషల్ మీడియాలో బికినీ లతో రెచ్చగోడుతుంది.. తాజాగా ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.. తాను తళ్లయినట్లు సోషల్ మీడియాలో ద్వారా తెలిపింది.. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది..
పెళ్లి కాకుండానే తల్లా.. ఇలియానా ఎందుకు అంత తొందర పడ్డావు అని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఆమె పంచుకున్నారు..అది కాస్త వైరల్ గా మారింది..నా లిటిల్ డార్లింగ్‌ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కమింగ్ సూన్ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు చెబుతోన్నారు. కాగా, పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ఇలియానా డేటింగ్లో ఉంది. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
అయితే, పెళ్లి కాకుండానే ఇల్లూ బేబీ ఎలా తల్లి అయ్యారని? కొందరు ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..ఇలియానా కడుపులో బిడ్డకు కారణం ఎవరు..? అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది . ఈ క్రమంలోనే రీసెంట్గా ఇలియానా తన ఇంస్టాగ్రామ్ లో ఓ బేబీ షాట్ ఫోటో పెట్టి పక్కన మమ్మ అనే లాకెట్ ని జత చేసింది. అంతేకాదు అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ లో “నా చిన్ని బేబీ ని మీట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను” అంటూ రాసుకు వచ్చింది.
ఈ క్రమంలోనే ఇలియానా ప్రెగ్నెన్సీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో బాలీవుడ్ మీడియాలలో సంచలనంగా మారింది . అయితే ఇలియానా నిజంగానే కడుపుతో ఉందా..? ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు ..? అని జనాలు మండిపడుతుంటే.. మరో కొందరు ఇప్పటికైనా అతగాడు ఎవరో చెప్పు ఇలియానా..? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. మరి పబ్లిసిటీ కోసం చెప్పిందా లేక నిజంగానే తల్లి అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది..