Ileana D’cruz : ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నాజూకు నడుము సుందరి హీరోయిన్ ఇలియానా. ఒకానొక సమయంలో దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. పవన్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలతో జతకట్టి.. కుర్రాళ్ల కలల రాణిగా ఓ వెలుగు వెలిగింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఇలియానా ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకొని తల్లి గా మారింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో బాబుకు జన్మనిచ్చిన ఇలియానా ప్రస్తుతం తన బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ అమ్మతనాన్ని ఆద్యాంతం ఆస్వాదిస్తోంది.
అయితే తాజాగా ఈ ఇలియానా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ తర్వాత తాను పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ‘డెలివరీ తర్వాత ప్రతి ఒక్కరికి డిప్రెషన్ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అయితే నేను దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాను. డెలివరీ తర్వాత నిద్రలేమి సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి.
దీని తగ్గించుకోవడం కోసం ప్రతి రోజూ వ్యాయామం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు వ్యాయామానికి కూడా సమయం కేటాయించలేక పోతున్నాను. ఆరోగ్యం పై తిరిగి శ్రద్ధ పెట్టడానికి ప్రయత్ని్స్తున్నాను. నా కుటుంబం కూడా ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చాలా రోజులైంది. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ బిజీగా ఉండటం వల్ల పోస్ట్ చేయలేకపోతున్నా.. ఫోనిక్స్ నా జీవితంలోకి రావడం గొప్ప విషయం’ అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.