గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాపో రామ్ సరసన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై అన అందంతో కుర్రకారు గుండెల్లో తిష్ట వేసింది. తర్వాత వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో అమ్మడికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. దీంతో వరుసగా స్టార్ హీరోలతో నటించి అగ్రస్థాయి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇటీవలే ఈ బబ్లీ బ్యూటీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 1వ తేదీన ఇలియానా తల్లిని అయ్యానంటూ శుభవార్తను అందరితో పంచుకుంది. తన ముద్దుల కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఆ చిన్నారి పేరు కోవా ఫీనిక్స్ డోలన్ ను రివీల్ చేసింది.
అయితే ఇంత వరకు ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. జులైలో ప్రియుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ అతడు ఎవరనే వివరాలు మాత్రం చెప్పలేదు. పైగా అందరూ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆమెకు పెళ్లి అయిందట.. అది ఎప్పుడో కాదు ఈ సంవత్సరమే. గతేడాది నుంచి వీరిద్దరు రిలేషన్ షిపులో ఉంటున్నారట. ఈ సంవత్సరం మే 13వ తారీఖున ఇలియానా తన ప్రియుడు మైఖైల్ ను పెళ్లి చేసుకుందట. అత్యంత సన్నిహితుల మధ్య వారిద్దరూ రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలియానా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయక ముందే తను పెళ్లి చేసుకుందని అంటున్నారు. అందుకే భయం లేకుండా పెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసిందట. ఆమె భర్త పేరు తప్పితే మిగతా వివరాలు ఏమీ ఎవరికీ తెలియదు. ఏదేమైనా ప్రెగ్నెన్సీ విషయాన్ని భయపడకుండా చెప్పిన ఇలియానా భర్త డీటేల్స్ మాత్రం ఎందుకు రివీల్ చేయడం లేదని అందరూ ఆశ్చర్యపోతున్నారు.