Ramyakrishna : ఇటీవల కాలంలో ప్రజెంట్ హీరోయిన్స్ కన్నా కూడా సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ బాగానే పెరిగింది. సీనియర్ హీరోయిన్లు ఏజ్ పెరుగుతున్నా గ్లామర్లో మాత్రం తగ్గడం లేదు. అలాంటి హీరోయిన్లలో సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ ఒకరు. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా తయారవుతోంది. రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్న శివగామి వయసు ప్రస్తుతం 50 ఏళ్లు పైనే.. ఇంత వయస్సు వచ్చిన చెక్కు చెదరని అందంతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది. రోజు రోజుకు అందాన్ని తింటుందా అనేంతలా గ్లామర్ మెయింటైన్ చేస్తుంది. ప్రస్తుతం కెరీర్ లో రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ప్రభాస్ ‘బాహుబలి’ వంటి భారీ చిత్రాల్లో నటించిన ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దాంతో ఎక్కువగానే సినిమాలను లైనప్ లో పెట్టుకుంటుంది.
ఈ అమ్మడు తెలుగులోనే కాదు తమిళంలో కూడా స్టార్ హీరోలతో జత కడుతూ కుర్రకారును ఫిదా చేస్తుంది. ఇటీవల కాలంలో లైగర్’, ‘రంగమార్తాండ’, ‘జైలర్’, ‘గుంటూరుకారం’ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై ఇలా తెగ సందడి చేస్తోంది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలంటే కచ్చితంగా దర్శకనిర్మాతలు లేదా హీరోల కోరిక తీర్చాలని, వారి పడకగదిలోకి వెళ్లాల్సిందేనంటూ చెప్పడం అందరినీ ఒకింత ఆశ్చర్యం.. ఒకింత అవాక్కయ్యేలా చేసింది. అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ, హీరోయిన్ కావాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. ఏదో ఒక విషయంలో సర్దుకు పోవాల్సిందే. ఒకవేళ అలా సర్దుకు పోకపోతే మన కెరీర్ అక్కడే ఆగిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని తెలిపింది. అందుకే కొన్ని కొన్ని సార్లు కొంతమంది దగ్గర లొంగి పోవాల్సి వస్తుందంటూ రమ్యకృష్ణ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.