Rakul Preet Singh : పాన్ ఇండియా లో లెవెల్ లో మంచి గుర్తింపుని దక్కించుకున్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగు లో కేవలం రెండు సినిమాలతోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంది.

కెరటం సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఈమెకి అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు తో పాటుగా తమిళం లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలా ఇండస్ట్రీ లో నెట్టుకొస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ఈమధ్య కాలంలో సరైన హిట్స్ లేవు.

దీంతో ఈమెకి సౌత్ లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే నేడు ఈమె తన ప్రియుడు జాకీ భగ్నానీ ని గోవాలో పెళ్లాడింది. లాక్ డౌన్ సమయం నుండి జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, మూడేళ్ళ పాటు డేటింగ్ చేసి, ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగానే సంపాదించిందట. అలాగే జాకీ భగ్నానీ బాలీవుడ్ లో పెద్ద నిర్మాత. అలాగే ఆయనకి ముంబై లో ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి, వాటి అన్నిటి ద్వారా ఆయన దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ఏర్పాటు చేసుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
