Sreeleela : సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా బాగుపడితే వారిని లాగేందుకు 4 చేతులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. చాలా రంగాల్లో ఇది సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. అయితే ప్రెజెంట్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీ లీలకి అదే పరిస్థితి ఎదురవుతుంది. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అవడంతో ఆమె పేరు ఓ రేంజ్ లో మారిపోతుంది.

ఈ క్రమంలో శ్రీ లీలను ట్రోల్ చేసేందుకు కొంత మంది రెడీగా కూర్చున్నారు. ఆమెకు ఆ ఒక్క గుణం లేకపోతే టీ, కాఫీలు ఇవ్వడానికి కూడా పనికిరాదని ట్రోల్ చేస్తున్నారు. ఇటు శ్రీ లీల పెద్ద ఎత్తు కాదు ..అందమైన ఫిగర్ కూడా కాదు .. కొంచెం బొద్దుగా ఉంటుంది. కానీ ఎలాంటి స్టెప్పులు అయినా ఆమె అవలీలగా వేస్తుంది.

ఆమెకు ఆ డ్యాన్స్ క్వాలిటీ లేకుంటే, అంత కలుపుగోలుతనం లేకపోతే ఇండస్ట్రీలో అస్సలు నిలబడలేనని కొంతమంది బోల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి కొందరు ఆమెకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియడం లేదని వాపోతున్నారు. మొత్తానికి శ్రీలీలను సక్సెస్ ఫుల్ గా వెళ్లకొట్టే ప్రయత్నాలు అయితే బాగా జరుగుతున్నాయ్ అని క్లారిటి వచ్చేసింది.