Singer Sunitha : స్టార్ సింగర్ సునీత పాడితేనే కాదు.. మాట్లాడితే కూడా మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే సునీత చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెల్సిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సునీత తన లైఫ్ గురించి.. తాను పడ్డ కష్టాల గురించి ఓపెన్ అయ్యింది. తను చాలా విషయాల్లో మోసపోయానని.. చిన్న వయసులోనే పెళ్లి.. పిల్లలు.. ఆవిడ తండ్రికి వ్యాపారంలో నష్టాలు.. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఇవన్నీ చిన్నతనంలోనే అనుభవించానని ఎమోషనల్ అయ్యింది.
అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సునీత ఎప్పుడూ అనుకునేదంట.. కానీ..తన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ మోసం చేస్తునే వచ్చారంట. అది తెలిసి షాక్ అయ్యిందట. కానీ ఏమీ చేయలేక ఓ నవ్వు నవ్వి ఊరుకునేదంట. అందరూ దాన్ని ఫేక్ స్మైల్ అని అనేవారని తెలిపింది సునీత.
తనకు ఏదైనా విషయం నచ్చకపోతే.. జస్ట్ అలా నవ్వి వదిలేస్తుందట. కానీ అది ఫేక్ స్మైల్ కాదని స్పష్టం చేసింది. ఫేక్ అనుకున్నా ఏమీ చేయలేనని కౌంటరిచ్చింది. తన సింగింగ్ పై కూడా విమర్శలు వస్తాయంది ఈ స్టార్ సింగర్. హస్కీ వాయిస్ అని.. పదాలు గొంతులోనే మింగేస్తుదని విమర్శలు వస్తాయంది. తన జీవితంలో తీసుకున్న కరెక్ట్ నిర్ణయం ఏదైనా ఉంటే.. అది రామ్ ని రెండో పెళ్లి చేసుకోవడమే అని ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది సునీత. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.