ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది సమంత. అనతి కాలంలోనే అగ్రహీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. పలు భాషల్లో నటించి తనేంటో ప్రూఫ్ చేసుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. వారి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా వివాహ జీవితానికి స్వస్తి పలికి సినిమాలపై దృష్టి పెట్టింది. వరుస సినిమాలు చేస్తుండగానే మయోసైటిస్ భారిన పడింది. దీంతో చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
తాజాగా ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో వరుస ప్లాపులతో బాధపడుతున్న సమంతకు “ఖుషి” తెచ్చింది. బాక్సాఫీసు వద్ద 75కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత తన అందంతో అలరించింది. ముఖ్యంగా విజయ్ తో రొమాంటిక్ సీన్స్ అదరగొట్టేసింది. ఈ మూవీ సక్సెస్ కావడానికి వారిద్దరి మధ్య రొమాన్స్ కూడా ఓ కారణమనే చెప్పాలి.
తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాను సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగు పెట్టకముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది. గతంలో సమంత ఆయనతో కలిసి ‘ అత్తారింటికి దారేది’ సినిమాలో నటించింది. ఆ సినిమా అవకాశం రావడం నిజంగా తన అదృష్టంగా భావించింది. తనకు పవన్ తో ఎన్ని సార్లు నటించే ఛాన్సులు వచ్చినా అసలు వదులుకోనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.