Actor Jeeva : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జీవిత చరిత్రని, ఆయన రాజకీయ ప్రస్థానం ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర 2’. 2019 వ సంవత్సరం లో జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ని ఆధారంగా తీసుకొని చేసిన ‘యాత్ర’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమాకి కొనసాగింపుగానే ఈ యాత్ర 2 తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ మరియు టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మంచి ఎమోషన్ తో ఈ సినిమాని డైరెక్టర్ మహి పీ రాఘవ్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం లో మొదటి భాగం లో వై ఎస్ ఆర్ పాత్ర పోషించిన మమ్మూటీ మళ్ళీ అదే పాత్రలో కనిపించాడు. ఇక సీఎం జగన్ పాత్రలో ప్రముఖ తమిళ హీరో జీవా నటించాడు. ఈ నెల 8 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఆయన చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు.
ఈ ప్రొమోషన్స్ లో అయాన్ మమ్మూటీ తో కలిసి పనిచేసిన అనుభూతిని మీడియాతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘మమ్మూటీ గారిని ఈ సినిమాకి ముందు నేను 2001 వ సంవత్సరం లో కలిసాను. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయనతో కలవడం, కలిసి నటించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయం లో నేను ఆయన్ని ఒక మాట అడిగాను. మీరు వైఎస్ఆర్ పాత్రని పోషించారు కదా, ఆయన వ్యతిరేకుల నుండి మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా అని.అప్పుడు ఆయన అలాంటివన్నీ నేను పట్టించుకోను, మంచి పాత్ర వస్తే చేసుకుంటూ పోడమే మనకి తెలిసిన పని. వైఎస్ఆర్ పాత్ర పోషించినంత మాత్రాన వైఎస్ఆర్ అభిమాని అవ్వము, అలాగే నువ్వు జగన్ క్యారక్టర్ చేసినంత మాత్రాన నువ్వు జగన్ ఫ్యాన్ అయిపోవు. మనం కేవలం నటులం మాత్రమే అని చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు జీవా. ఇది ఇలా ఉండగా గతం లో ఆయన అనేక ఇంటర్వ్యూస్ లో టాలీవుడ్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకున్న రోజులు ఉన్నాయి.