Hyper Aadi : జబర్దస్త్ కమెడియన్ ఆది గురించి అందరికి తెలుసు.. నాన్ సింక్ పంచులతో కామెడీని పండిస్తూ జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.. వరుస సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు.. పలు టీవీ షోలలో కనిపిస్తూ జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు.. అయితే ఆదికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ.. దాంతో పాటు రూమర్స్ కూడా ఎక్కువే.. ఎప్పుడు ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తాడు.. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఆయన కొత్తగా వచ్చిన యాంకర్స్ కు లైన్ వేస్తాడు అని టాక్ ఉంది.. తాజాగా ఆదికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

మొన్నటివరకు జబర్దస్త్ కు కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్య రావు తో పులిహోర కలిపాడు. దానికి దిమ్మతిరిగే కౌంటర్లిచ్చింది సౌమ్య రావు. దీంతో నెమ్మదిగా సైలెంట్ అయ్యాడు ఆది, ఆ తర్వాత షోనే వదిలి వెళ్లాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆమెనే హైపర్ ఆది వెంటపడటం షాకిస్తుంది. ఇదే పెద్ద షాక్ అంటే, ఆమెకి వర్ష మరో పెద్ద షాకిచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే నవ్వు ఆగదు..తాజాగా జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ని పంచుకుంది. ఇందులో హైపర్ ఆదితో పులిహోర కలుపుతూ కనిపించింది సౌమ్య రావు.

ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా నడుచుకుంటూ వెళ్తారు. మధ్యలో జబర్దస్త్ వర్ష కనిపిస్తుంది.ఆమెని వెనకాల నుంచి గిల్లుతుంది సౌమ్య రావు. అక్కడే పెద్ద దెబ్బ పడింది.ఆదితో తాను సైలెంట్‌గా వెళ్లకుండా మధ్యలో వర్షని గిల్లింది సౌమ్యరావు. దీంతో వర్ష ఎగ్జైటింగ్‌గా రియాక్ట్ అయ్యింది. అంతేకాదు సౌమ్యరావుకి పెద్ద షాకిచ్చింది. హైపర్ ఆదిని తన బుట్టలో వేసుకుంది. వర్ష కి టెంప్ట్ అయని ఆది, ఆమెతో కలిసి వెళ్లిపోగా, ఆ నిర్వాహకం చూసి నోరెళ్లబెట్టడం సౌమ్య రావు వంతు అయ్యింది. ఇది ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు నవ్వులు పూయిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒకసారి చూడండి..