Hyper Aadi గురించి ఎంత చెప్పినా తక్కువే..బుల్లితెర కామెడీ షోలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకొని అడల్ట్ జోకులతో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఆది..పంచులు, ప్రాసలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఎవరో ఒకరితో రొమాంటిక్ ట్రాక్ లవ్ ట్రాక్ నడిపించాలని చూస్తూ ఉంటాడు. తాను రాసుకునే స్క్రిప్ట్లే కాబట్టి తనకు నచ్చిన వారితో ట్రాక్ సెట్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది. అవి కాస్త జనాలకు కూడా బాగానే కనెక్ట్ అవుతుండడంతో ఆది రెచ్చిపోతున్నాడు.. జబర్దస్త్ లో అనసూయ తో లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే.. ఇప్పుడు శ్రద్దా దాస్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు.. అందుకు సంబందించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతుంది..
అప్పుడు అనసూయ మీద కోరిక ఉన్నట్టుగానే తన స్కిట్లలో డైలాగ్స్ పేల్చేవాడు.. తనకు పెళ్లయిందని, భర్త ఉన్నాడని అనసూయతో డైలాగ్స్ చెప్పిస్తూనే ఆది మాత్రం తన కోరికలను బయటపెట్టేవాడు. అంతేకాదు హగ్గులు, కిస్సుల కోసం స్కిట్లలో సీన్లు కూడా రాసుకుంటూ ఉండేవాడు. అయితే ఇదంతా సరదాకే అని తెలిసినప్పటికీ కూడా వారిద్దరి మధ్య కెమిస్ట్రీబాగుండటంతో షో మేనేజ్మెంట్ తో పాటు జనాలు కూడా ఆసక్తిగా వాళ్లను చూసేవాళ్ళు..
ఇప్పుడు డీ షోలో కూడా ఎవ్వరిని వదల్లేదు.. మొన్నటివరకు ప్రియమణి, ఇప్పుడు శ్రద్దా దాస్ ను కూడా వద్దల్లేదు..ఆదిని ప్రియమణి బావా అని పిలిచేది. అలా ఈ ఇద్దరి చేష్టలు కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ప్రియమణితో హగ్గులు ముద్దులు అంటూ నానా హంగామా చేసేవాడు ఆది.అయితే ఇప్పుడు ఆ షో నుంచి ప్రియమణి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి శ్రద్ధ దాస్ వచ్చింది.
ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా శ్రద్దా దాస్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది.. తాజాగా మల్లెమాల విడుదల చేసిన ప్రోమోలో పాట పాడి ఆదిని ఇంప్రెస్ చేసింది శ్రద్దా..దానికి తగ్గట్లుగానే ఆది కూడా పాట పాడాడు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.. దీన్ని చూసిన నెటిజన్లు ఏందయ్యా ఆది..అప్పుడు అనసూయ.. ఇప్పుడు శ్రద్దా.. ఎవరిని వదలవా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మీరు ఆ రొమాంటిక్ ట్రాక్ ను ఒకసారి చూడండి..