బాలకృష్ణను బాలయ్య అని ఎందుకంటారో తెలుసా..

- Advertisement -

ఆనాటి స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున 60 ఏళ్ల వయసు పూర్తయిన ఇప్పటికీ తెలుగు తెరపై తమ ఉనికిని చాటుకుంటున్నారు. వెంకటేష్, నాగార్జున ఫ్లాప్స్ తో ఉండగా.. చిరంజీవి, బాలకృష్ణ విజయాలతో ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఈ ఇద్దరిలో బాలకృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. నందమూరి బాలకృష్ణను ఫ్యాన్స్ చాలా పేర్లతో పిలుస్తుంటారనే విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇతడిని అభిమానుల ముద్దుగా నటసింహం అని.. బాలయ్య బాబు అని.. యువరత్న అని.. గోల్డెన్ స్టార్ అని.. ఇలా అనేక పేర్లతో పిలుచుకుంటారు అనే విషయం తెలిసిందే.

బాలకృష్ణ
బాలకృష్ణ

కానీ నందమూరి అభిమానులతో పాటు మామూలు తెలుగు ప్రేక్షకులు సైతం ఈయనను ఎక్కువుగా జై బాలయ్య అనే పేరుతోనే పిలుస్తారు. జై బాలయ్య అనే స్లోగన్ ఎలా వచ్చిందో ఎప్పటి నుండి బాలయ్యను అలా పిలుస్తున్నారో.. జై బాలయ్య అనే స్లోగన్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినా పేరు.. ఆ మధ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో ఏకంగా జై బాలయ్య అనే సాంగ్ కూడా పెట్టారు. ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సాంగ్ థియేటర్ లో వస్తుంటే నందమూరి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ఇంతకు ముందు కంటే ఈ సాంగ్ వచ్చిన తర్వాత జై బాలయ్య అనే స్లోగన్ మరింత పవర్ ఫుల్ గా వినిపిస్తుంది. ఆ తర్వాత బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాకు కూడా ముందుగా “జై బాలయ్య” అనే టైటిల్ అనుకున్నారు.

Balakrishna

అసలు బాలయ్య అనే స్లోగన్ ఎలా వచ్చిందో మీకు తెలుసా.. డైరెక్టర్ బి గోపాల్, బాలకృష్ణ కాంబో అంటే తిరుగులేనిది.. వీరిద్దరి కాంబోలో దాదాపు ఐదు సినిమాలు చేస్తే అందులో నాలుగు సూపర్ హిట్ అవ్వగా.. ఒకటి మాత్రమే ప్లాప్ అయ్యింది. 1990 విడుదలైన లారీ డ్రైవర్.. ఈ సినిమా చేసేటప్పుడు బి గోపాల్ రచయితతో మీరు ఏమైనా రాసుకోండి కానీ పాటలో బాలయ్య అని మాత్రం వినిపించాలి అని చెప్పాడట.

- Advertisement -

రచయిత జొన్నవిత్తుల ఆయన విన్నపాన్ని విని అలాగే సాంగ్ లో బాలయ్య అని వచ్చే విధంగా “బాలయ్య.. బాలయ్య.. గుండెల్లో గోలయ్య.. జోకొట్టాలయ్యా”.. అనే పాట రాసారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన స్వరాలు లారీ డ్రైవర్ చిత్రాన్ని విజయవంతం చేశాయి. ఈ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికి బాలకృష్ణను బాలయ్య అని ముద్దుగా పిలుచుకోవడం అలవాటు అయ్యింది. ఇలా బాలయ్య కాస్త జై బాలయ్య అయిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com