Anger Tales Review : వెంకటేష్ మహా, తరుణ్ భాస్కర్, సుహాస్ , బిందు మాధవి , మడోన్నా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్.. ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నాలుగు విభిన్నమైన కథలతో రూపొందించిన ఈ ఆంథాలజీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.. నితిన్ ప్రభల తిలక్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ కు నాలుగు సిరీస్ కు నలుగురు సినిమా ఆటోగ్రాఫర్స్ పనిచేయడం విశేషం.. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..
కథ:
యాంగర్ టేల్స్ స్టార్ హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే, ఏం తినాలో కూడా చెబితే, అద్దె ఇంట్లో తలనొప్పులు వస్తే, జుట్టు ఊడితే ఎన్ని సమస్యలు అంటే.. ఇలా నాలుగు కథలని వివరిస్తుంది. ఏ కథకు ఆ కథ వేరుగా ఉంటుంది కానీ నాలుగు కథల్లో ఉన్న ఎమోషన్ మాత్రం ఒక్కటే.. అదే రెబలిజం.. వారి బాధలు ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడం తిరుగుబాటు చేయడం నాలుగు కథలలో రెండు కథలు అందర్నీ ఎక్కువగా ఆకట్టుకుంటాయి . రెండు కథలు, కథనం కాస్త స్లోగా ముందుకు వెళ్తాయి. ప్రేక్షకుల మీద ఎలాంటి చూపించవు. పైగా ఆ కథలకు ఇచ్చిన ముగింపు కూడా ఎవ్వరికీ ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించదు. ఇక రాధ, రంగా కథలు మాత్రం ఈ వెబ్ సిరీస్ కి మంచి హైట్ ని క్రియేట్ చేస్తాయి. మొదటి, మూడవ కథలు చుసే కొద్ది చూడాలని అనిపిస్తుంది. పైగా రెండు కథలల్లోనూ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఫుడ్ విషయంలో తీసుకున్నందుకు ఆ టాపిక్ హైలైట్ అయిందో.. లేదంటే ప్రతి ఇంట్లో ప్రతి విషయంలో నియంత్రించే భర్త ఉంటే స్త్రీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది చెప్పడానికి ఉదాహరణగా చెప్పొచ్చు. కాగా ఆ కథను కూడా సింపుల్ గా తేల్చేశారు రెండో కథలో కొత్త విషయం ఏమీ ఉండదు. హిందీ బాల, తెలుగు నూటక్కా జిల్లాల అందగాడు లో చెప్పిన విషయాన్ని కాస్త కొత్తగా చూపించాలని ప్రయత్నించాడు డైరెక్టర్.
ఇక నటీనటుల నటన విషయానికి వస్తె.. తరుణ్ భాస్కర్ , మడోనా నటన బాగుంటుంది. ఫణి ఆచార్య కూడా నటుడిగా మంచి మార్కులే కొట్టేశారు. ఈ వెబ్ సిరీస్ తో బిందువు మాధవి యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక తనకు తగ్గట్టుగానే ఆ కథ డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ మహిళా పాత్రలో బిందు మాధవి ఒదిగిపోయింది. ఇక వెంకటేష్ మహా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి. స్టార్ హీరో అభిమానిగా వెంకటేష్ మహా తీరు అందరినీ ఆకట్టుకుంది. సుహాస్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతః. తెరపై వీళ్లు ఎంత అద్భుతంగా నటించారు. వీరి నటనకు సరైన టైంలో రైనా సంగిత్మ అందించారు మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి. ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ హైలెట్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు. ఆంథాలజీలో ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్ లో యాంగర్ టేల్స్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
నటీనటులు: వెంకటేష్ మహా, తరుణ్ భాస్కర్, సుహాస్ , బిందు మాధవి , మడోన్నా సెబాస్టియన్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య, తదితరులు
రచన : కార్తికేయ కారెడ్ల , నితిన్ ప్రభల తిలక్
కొరియోగ్రాఫర్స్: అమర్ దీప్, వినోద్ కే బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజే అరుణ్
సంగీతం : స్మరణ్ సాయి
దర్శకత్వం : నితిన్ ప్రభల తిలక్
నిర్మాతలు : శ్రీధర్ రెడ్డి, సుహాస్
విడుదల తేదీ: మార్చి 9, 2023 ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్.