Honey Rose : ఏకంగా అలాంటి పాత్రలో హనీరోజ్.. కుర్రాళ్లను ఆపడం కష్టమేగా..!

- Advertisement -

Honey Rose : ఎట్టకేలకు హనీరోజ్​ అభిమానుల కల తీరింది. గత ఆరు, ఏడు నెలలుగా ఆమె కొత్త సినిమా అనౌన్స్​మెంట్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు సంతోషం కలిగించే వార్త వచ్చింది. ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో బాలయ్య సరసన నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకున్న హనీరోజ్.. ఆ ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్​డమ్ అందుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ స్క్రీన్​పై ఎక్కడా కనపడలేదు. కేవలం సోషల్​మీడియాలోనే దర్శనమిస్తూ.. తన సూపర్ హాట్ ఫొటోస్​ కుర్రకారు మతిపోగొడుతోంది.

Honey Rose

అయితే ఈ పిక్స్​ను తెగ సంతోషపడిపోయిన్​ ఫ్యాన్స్.. ఆమె సినిమాలను ప్రకటించకపోయేసరికి కాస్త నిరుత్సాహపడ్డారు. కానీ ఇప్పుడామె కొత్త సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అనౌన్స్ చేసేసింది. ఇప్పటికే తన ఫొటోస్​తో కేక పుట్టించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా.. అంతకుమించి అనేలా మాస్ అవతారంలో కనిపించి ఆకట్టుకుంది. ఆ సినిమా వివరాలును తెలుసుకుందాం. ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హనీరోజ్​.. ఎట్టకేలకు తన కొత్త సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. ఆమె మాస్ పోస్టర్​ చూస్తుంటే మతి పోతుంది. అంత వైలెన్స్​గా కనిపించింది. ఈ సినిమా పేరును ఇంగ్లీష్​లో Rachel తెలుగులో ‘రాహేలు’​ అని ఖరారు చేశారు.

హనీరోజ్

ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్​లో ఆమె కత్తి పట్టుకుని సీరియస్​గా మాంసం కొడుతూ కనిపించింది. ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు కనిపిస్తున్నాయి. ఆమె సీరియస్​గా కనిపిస్తున్నప్పటికీ.. తన గ్లామరస్ యాంగిల్‌ అలానే కనిపిస్తోంది. ఆమె బీఫ్ అమ్మే దుకాణదారుని పాత్ర చేస్తుందని తెలుస్తోంది. ఇంకొంతమమంది కాస్త నెగటివ్​ షేడ్స్​ తరహా పాత్ర కూడా అయిండొచ్చని అంటున్నారు. ఈ చిత్రంతో ఆనందిని బాల దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అబ్రిడ్ షైన్ సమర్పిస్తున్నారు. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్​ చూస్తుంటే.. కాస్త భయంకరంగా ఉన్నప్పటికీ.. హనీరోజ్ పరువాల పదును కూడా గుండెల్ని మెలిపెట్టేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here