సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇప్పుడు చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్లయిపోతున్నారు. అలా సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో చేసి.. ఇలా బుల్లితెరపై.. కొందరైతే ఏకంగా వెండితెరపై కనిపించే ఛాన్సులు కొట్టేస్తున్నారు. కానీ కొన్నేళ్ల క్రితం ఇలా బుల్లితెరపై ఛాన్సు రావాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన అవమానాలు తప్ప అవకాశాలు రాకపోయేది. అలాంటి టైంలోనే అన్ని అడ్డంకులు అధిగమించి సినిమాపై ఉన్న ప్రేమతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హిమజ. బుల్లితెరపై తన సత్తా చూపి.. నెమ్మదిగా వెండి తెరపై అవకాశాలు దక్కించుకుంది.

టీవీలో సీరియల్స్ క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన హిమజ.. ఆ తర్వాత పలు ఈవెంట్లలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలో ఛాన్సులు కొట్టేసింది. ఒకప్పుడు కేవలం హీరోయిన్ ఫ్రెండ్ గానే అవకాశాలు దక్కించుకున్న హిమజకు.. కొద్దిరోజుల తర్వాత కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు రావడం షురూ అయ్యాయి. ఇక డిజిటల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.
ఇక సోషల్ మీడియాలో ఈ భామ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ప్రతి విషయం షేర్ చేసుకుంటూ ఉంటుంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తుంది. తాజాగా ఈ భామ సమ్మర్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లింది. ఇక అక్కడ టైమ్ స్క్వేర్ వద్ద తన ఫ్రెండ్స్ తో జాలీగా గడిపింది.
ఈ క్రమంలోనే టైమ్ స్క్వేర్ వద్ద ఓ స్టాల్ వద్దకు వెళ్లిన హిమజ.. అక్కడున్న భారీ అనకొండను తన మెడలో వేసుకుంది. అలా కాసేపు భయపడుతూ.. కాసేపు ఎంజాయ్ చేస్తూ.. తన అడ్వెంచర్ తో అలరించింది. ఈ వీడియోను కాస్త తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. హలో.. మిస్టర్ డైమండ్ ను కలవండి అంటూ ఆ అనకొండను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో హిమజ ధైర్యాన్ని చూపి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.