Tollywood Actress : సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా సరే ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి.. కానీ చాలా మంది పెళ్లి వయసు వచ్చినా దాని గురించి పట్టించుకుంటలేరు. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారి జాబితా చాలానే ఉంది. వారిలో ముఖ్యంగా హీరోయిన్లు పెళ్లి వయసు వచ్చి దాటిపోయినా దాని ఊసేలేదు. మరి కొంతమందికైతే పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.
సీనియర్ హీరోయిన్ల విషయానికి వస్తే రమ్యకృష్ణ, రోజా, రంభ, జ్యోతిక, నమిత, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లంతా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. సీనియర్ హీరోయిన్లు కొంత మంది ఏజ్ బార్ అయినా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. అనుష్క, త్రిష, తమన్నా వంటి వారు ఈ జాబితాలో ముందున్నారు.
త్రిషకు గతంలో ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగి ఆ తర్వాత పెళ్లి రద్దు చేసుకుంది. అనుష్క గురించి ఎప్పటికప్పుడు పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ తో పెళ్లి వార్తలే కాదు.. ఓ వ్యాపారవేత్తతో పెళ్లి చేసుకోబోతుందనే గాసిప్స్ కూడా వస్తున్నాయి. హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.
మరో కథానాయిక విమలా రామన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నా పెళ్లి చేసుకోలేదు. వీరితో పాటు అంజలి, రకుల్ ప్రీతి సింగ్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక కెరీర్ మొదట్లోనే ఓ నటుడితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లిని రద్దు చేసుకుంది. ఆమె బాటలోనే హీరోయిన్ మెహ్రీన్ కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. వీరంతా సినిమాలపై ఉన్న మోజుతోనే నిశ్చితార్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.