Vaishnavi Chaitanya : విజయ్ దేవరకొండ సోదరుడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ
. సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు. అల వైకుంఠపురములో
మూవీలో బన్నీకి చెల్లెలుగా నటించిన వైష్ణవి చైతన్య ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఎస్కెఎన్ నిర్మించిన ఈ మూవీ జూలై 14న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్‌కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం ట్రైలర్‌ని విడుదల చేశారు.
దీనిపై ఓ నెటిజన్ అసభ్య పదజాలంతో కామెంట్ చేయడం తెలిసిందే. ఆ కామెంట్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆనంద్ దేవరకొండ అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయంపై వివాదం చేయడం అనవసరం అనుకుంటున్నా. సినిమా చూసిన తరువాత కామెంట్ చేసి ఉంటే బాగుండేది
అంటే సదరు నెటిజన్‌కు కౌంటర్ ఇవ్వడం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇందులో నటించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య ఓ రిపోర్టర్‌కు షాకిచ్చింది.
ముద్దు పెట్టుకుంటానని అడిగితే చెప్పు తెగుద్ది అంటూ షాకిచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృదం ప్రత్యేకంగా పలు మీడియా హౌస్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే హీరో ఆనంద్ దేవరకొండ, మరో హీరో విరాజ్ అశ్విన్‌తో కలిసి ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా హీరోయిన్ని ప్రశ్నించిన సురేష్ కొండేటి తను ఇచ్చిన సమాధానం విని బిత్తరపోయాడు.
వైష్ణవి ముద్దు పెట్టుకుంటా
?. అని హీరోయిన్ని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన హీరోయిన్ వైష్ణవి చైతన్య ఏం మాట్లాడాతో తెలియక సైలెంట్ అయిపోయింది. అది గమనించిన సురేష్ కొండేటి సినిమాలో హీరో అడిగిన ప్రశ్న అని అనగానే.. టీజర్లో ఉన్న డైలాగా? అంటూ ముద్దు పెట్టుకుంటా అంటే చెప్పు తెగుద్ది అంటాను` అని ముఖం మీదే చెప్పేసింది. దీంతో సదరు రిపోర్టర్ సురేష్ కొండేటి బిత్తర ముఖం వేసి సైలెంట్ అయిపోయాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కొంత మంది సదరు రిపోర్టర్ని ఓ ఆట ఆడుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. నాకు మా ఇంట్లో అమ్మా నాన్నా తిడితేనే చాలా బాధేసేది. మీ కన్నా వయసులో చిన్న వాళ్ళు, టోటల్ మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజల మొహం మీద ఉమ్మేస్తున్నా ఎలా సార్ ఇలా తుడిచేసుకుని బతికేస్తున్నారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.