సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనిపించిన అద్భుతమైన నటీమణులలో త్రిష ఒకరు. ఆమె అందమైన ముఖం మాత్రమే కాదు, అపారమైన నటనా సామర్ధ్యాలు కూడా కలిగి ఉండటం వల్లే అటు తెలుగు ఇటు తమిళ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాజ్యమేలారు. అయితే, కొంత కాలంగా ఆమెకు మంచి పాత్రలు రాకపోయినా, తాజాగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా ఆమె దశను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఆమె చేతి నిండా క్రేజీ ఆఫర్లు ఉన్నాయి.
పొన్నియిన్ సెల్వన్ లో అందాల సుందరి ఐశ్వర్యారాయ్ ఉన్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదుకానీ .. అందరూ త్రిషని అలాచూస్తూ ఉండిపోయారు. ఆ అందానికి , అభినయానికి ఫిదా అయిన హీరోలు , డైరెక్టర్లు ..వరసగా ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. త్రిషకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్టు తెలుస్తోంది. 40 ఏళ్లు వస్తున్నా.. హీరోయిన్ గా ఆఫర్లు రావడం అంటే మాటలు కాదు కదా. పీఎస్ 1 ముందు వరకూ .. లేడీ ఓరియంటెడ్ సినిమాలుచేస్తూ..సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న త్రిష.. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు కొట్టుస్తోందట.
ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలు అయిన అజిత్ , విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష ఆఫర్ కొట్టేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా వయసు పెరుగుతున్న కూడా వన్నె తరగని అందం త్రిష సొంతం అని చెప్పవచ్చు.ఇటీవల త్రిష 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.నాలుగు పదుల వయసు లో కి వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిలర్ గానే ఉంటూ చెక్కుచెదరని అందం తో వరుస గా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.