దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. ఒకే సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అసలు శ్రీలీల ఎనర్జీకి ఇండస్ట్రీ ఫుల్ ఫిదా అయిపోయింది. ఇటీవలే రవితేజ సరసన ధమాకా మూవీలో నటించి మరో హిట్టుని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఓ పది సినిమాల్లో నటిస్తున్న శ్రీ లీల కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలనుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

తెలుగులో శ్రీలీల ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం శ్రీలీల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని సమాచారం. శ్రీలీల చేతిలో వరసగా పది సినిమాలకు పైగా ఉండటంతో గ్యాప్ తీసుకోవడానికి డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ గ్యాప్ మధ్యలోనే తన ఎంబీబీస్ కోర్స్ ను కూడా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఎంబీబీస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటంతో ఈ డెసీషన్ తీసుకున్నట్టు సమాచారం. శ్రీలీల తనలోని గ్రేసింగ్ డ్యాన్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆకట్టుకుంది.

రవితేజ ధమాకా మూవీలో మోస్ట్ ఎనర్జీటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దీంతో వరుస అవకాశాలు వస్తుండటంతో ఫ్యాన్స్ సైతం మస్తు ఖుషి అవుతున్నారు. ఇక శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబు తో గుంటూరు కారం, పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ తో భగవంత్ కేసరి, రామ్ తో స్కంధ, నితిన్ తో ఎక్సట్రా, వైష్ణవ్ తేజ్తో ఆదికేశవ, విజయ్ దేవరకొండ తో మరో మూవీ ఇలా పలు హీరోలతో యాక్ట్ చేయడానికి డేట్స్ ఇచ్చింది. శ్రీలీలకు కావలసిన బ్రేక్కు హీరోస్, డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ అందరూ ఒకే అన్నట్లు సమాచారం. ఎందుకంటే శ్రీలీల కోసమే ప్రాజెక్ట్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది.