Saloni : షాకింగ్.. హీరోయిన్ సలోని ఇంత హాట్ గా తయారు అయ్యిందేంటి..స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారుగా!

- Advertisement -

Saloni : టాలీవుడ్ లో ఒక హీరో కానీ , హీరోయిన్ కానీ సక్సెస్ కావాలంటే అందం మరియు అభినయం తో పాటుగా అదృష్టం కూడా బాగా కలిసి రావాలి. అప్పుడే ఇండస్ట్రీ లో సక్సెస్ కాగలరు..టాలెంట్ ,అందం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇండస్ట్రీ లో సరైన సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్న హీరోలు మరియు హీరోయిన్లు చాలా మంది ఉన్నారు, అలాంటి వారిలో ఒకరు సలోని అశ్విని.

saloni
saloni

మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మాయి తెలుగు మరియు కన్నడ భాషలకు కలిపి 23 చిత్రాలలో నటించింది.అందులో హీరోయిన్ పాత్రలతో పాటుగా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కూడా చాలానే ఉన్నాయి..ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలలో సూపర్ హిట్ అయ్యినవి కేవలం రెండే.ఒకటి సునీల్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘మర్యాద రామన్న’ సినిమా మరొకటి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా నటించిన ‘బుద్దిమంతుడు’ అనే సినిమా.

ఇక ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు..ఆమె వెండితెర మీద చివరిసారిగా కనిపించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’.2016 వ సంవత్సరం విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది.కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పటికీ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.సలోని గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈమె తండ్రి నార్కోటిక్స్ లో అసిస్టెంట్ కమీషనర్ గా పని చేస్తున్నాడు.

- Advertisement -
saloni Photos

సలోని ఇండస్ట్రీ లోకి రావడం ఆయనకీ ఏమాత్రం ఇష్టం లేదు..ఏదైనా జాబ్ చేసుకోమని ఒత్తిడి చేసేవాడు, కానీ సలోని అమ్మ మాత్రం ఈమెని ప్రోత్సహిస్తూ ఉండేది..ఆమె ప్రోత్సాహం తోనే నాన్న కి తెలియకుండా మోడల్ ఏజెన్సీ లకు తన ఫోటోలను పెట్టేది, అలా మోడల్ గా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ఈమె ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించింది.అంతే కాదు డ్రామాలు వెయ్యడం లో కూడా ఈమె దిట్ట, ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి ని చాలా చక్కగా ఇమిటేట్ చేస్తుంది.

కమర్షియల్ యాడ్స్ ద్వారా పాపులారిటీ ని తెచ్చుకున్న సలోని, ఆ తర్వాత హీరోయిన్ గా మారడం , ఇక తర్వాత జరిగిన విషయాలన్నీ మనకి తెలిసిందే..అయితే రీసెంట్ గా సలోని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.. ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది, మీరు కూడా ఆమె లేటెస్ట్ ఫోటోలను చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here