‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచేసింది పాయల్ రాజ్‌పుత్. నటనపై ఉన్న ఆసక్తితో సినీ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న ఆమె ప్రస్తుతం కెరీర్ బిల్డ్ చేసుకునే పనిలో ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన సినీ, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటోంది పాయల్. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టింది.

స్టార్ హీరో మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ మిస్ అయ్యానని పాయల్ రాజ్ పుత్ పేర్కొంది. సర్కారు వారి పాట సినిమాలో అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూశానని.. కానీ ఆ ఛాన్స్ కీర్తి సురేష్ కి వెళ్ళిందని చెప్పింది. అయితే కీర్తి సురేష్ ఆ మూవీలో అద్భుతంగా నటించిందని ఆమె పేర్కొంది. మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన పాయల్ రాజ్ పుత్.. తన డ్రీమ్ హీరో మహేష్ అంటూ ఓపెన్ అయింది. ఆయనతో ఒక్క సినిమాలో అయినా నటించాలనే కోరిక ఉందని తెలుపుతూ తన మనసులో మాట బయట పెట్టింది పాయల్.

కథల ఎంపికలో చేసిన తప్పుల వల్ల తొలుత కొన్ని సినిమాలు అలరించలేకపోయాయని తెలిపింది. ‘‘నేను ప్రతి సినిమాకు 100 శాతం ఎఫెక్ట్ పెడతాను. నా తొలి సినిమా తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. ఆ సమయంలో కొంతమంది దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించారు. అవకాశం వచ్చిన ప్రతి కథను ఓకే చేశాను. ఇప్పుడు అలా చేయడం లేదు. కథ నాకు సరిపోతుందా.. లేదా అని తెలుసుకుని అంగీకరిస్తున్నాను. సినీ పరిశ్రమలో ఒడుదొడుకులు సహజం. అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగాలి. నేను ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తుంటాను. వెంకటేశ్‌తో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని చెప్పింది.