ఎల్లప్పుడూ ఉత్సాహంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలు సంధించి స్ట్రాంగ్ లేడీ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ సినీ నటి మరియు నగరి నియోజకవర్గం MLA రోజా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలం నుండి ఆమె అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంది. రెండు సార్లు ఆమెకి ఆపరేషన్స్ కూడా జరిగాయి. కాళ్ళు బాగా వాచిపోవడం అందుకు కారణం అని అంటున్నారు డాక్టర్లు.
మామూలుగా లివర్ మరియు కిడ్నీ లలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇలా కాళ్ళు వాచిపోవడం వంటివి జరుగుతుంటాయి. రెండేళ్ల క్రితం కూడా ఆమె ఇదే అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంది. కానీ ఎలాంటి ఫలితం చూపెట్టలేదు, డాక్టర్లు బాగా విశ్రాంతి తీసుకోవాలని రోజా కి చాలా కచ్చితంగా చెప్పారు. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నప్పటికీ , మళ్ళీ ఆమె రాజకీయాల్లో బిజీ అయ్యారు. కొంతకాలం క్రితమే ఆమె కబడ్డీ ఆడుతూ క్రిందపడిపోవడం వంటివి మనం చూసాము.
ఎప్పుడైతే ఆమె అనారోగ్యం తో ఆసుపత్రి పాలైంది అనే న్యూస్ బయటకి వచ్చిందో, అప్పటి నుండి అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆ రెస్పాన్స్ ని డాక్టర్లు స్పందిస్తూ, రోజా ప్రాణానికి ఎలాంటి హాని లేదని, కేవలం ఆమెకి సర్జరీ మాత్రమే చేస్తున్నామని, త్వరలోనే ఇక్కడి నుండి దిస్ఛార్జి చేస్తామని చెప్పుకొచ్చారు.
ఆమె సంపూర్ణంగా కోలుకునే వరకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోనుంది. అయితే రోజా తనకి అనారోగ్యం వస్తే ఆంధ్ర ప్రదేశ్ లోనే ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చు కదా?, ఎందుకు నగరి నుండి చెన్నై కి వెళ్లి అక్కడి అపోలో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది?, అంటే జగన్ కట్టించిన ప్రభుత్వ హాస్పిటల్స్ పై ఆమెకి విశ్వాసం లేదా అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ట్రోల్ల్స్ విసురుతున్నారు.