Mehreen Pirzada : అందంతో పాటుగా చక్కటి అభినయం కలిగి ఉన్న అతి తక్కువ మంది టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరు మెహ్రీన్ పిర్జాడా. చూసేందుకు ఈమె అచ్చం కాజల్ అగర్వాల్ లాగ ఉంటుంది. అదే ఈమెకి ప్లస్ అయ్యి సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేసింది. న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా మెహ్రీన్, ఆ సినిమా తర్వాత దాదాపుగా కుర్ర హీరోలందరితో సినిమాలు చేసింది.

కానీ పెద్ద స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఈమె నటించిన చిత్రాలలో పెద్ద హిట్ గా నిల్చినవి ఎఫ్ 2 , ఎఫ్ 3 మరియు రాజా ది గ్రేట్. ఈ సినిమాలు మినహా ఆమె కెరీర్ లో చెప్పుకోదగినవి లేవు. అయినా కానీ ఈమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.

రీసెంట్ గా ఈమె డిస్నీ + హాట్ స్టార్ నిర్మించిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె హద్దులే దాటి రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది. దీనిపై సోషల్ మీడియా లో ఈమెని అభిమానించే వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. అందరి హీరోయిన్స్ లాగ నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ మెహ్రీన్ ని ట్యాగ్ చేస్తూ తిట్టడం ప్రారంభించారు.

దీనికి మెహ్రీన్ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ శృంగారం సినిమాలో భాగం, అది నా వృత్తి కాబట్టే చేశాను. కొన్ని సన్నివేశాలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా సందర్భాన్ని బట్టీ కచ్చితంగా చెయ్యాల్సి వస్తుంది, అది నా జాబ్, దానికి మీరు హర్ట్ అయితే నేనేమి చెయ్యలేను’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
