Hyper Aadi : హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?

- Advertisement -

Hyper Aadi : కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన నిత్యం ఏదో ఒక వివాదంతో ట్రెండింగులో ఉంటారు. హైపర్ ఆది కి ఓ స్టార్ హీరోయిన్ తో గొడవ జరిగింది. దీంతో సదరు హీరోయిన్ ఆది మళ్లీ నోరు తెరవకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ వీళ్ళిద్దరికీ ఏ విషయంలో గొడవ జరిగింది? స్టార్ హీరోయిన్ రిప్లై ఏంటి అనే విషయం తెలుసుకుందాం. బుల్లితెర నుంచి వెండి తెర ప్రేక్షకుల దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీప్రియులకు బాగా పరిచయం ఉన్న పేరు హైపర్ ఆది.

Hyper Aadi
Hyper Aadi

స్పాంటేనియస్ గా వేసే పంచులకు పెట్టింది పేరు హైపర్ ఆది. ఈ కమెడియన్ పంచులతో జనాలను కడుపుబ్బా నవ్విస్తుంటారు. హైపర్ ఆది ప్రస్తుతం చేస్తున్న షోలలో ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కూడా ఒకటి. ఈ సీజన్లో సెలబ్రిటీలు పోటీ పడబోతున్నారు. హైపర్ ఆదితో పాటు శ్రీ సత్య టీం లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ప్రతి ఎపిసోడ్ లో సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి సంఘటన చేస్తారు. ఇక గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ తో పాటు స్టార్ హీరోయిన్ హన్సిక కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోలో హీరోయిన్ హన్సిక, హైపర్ ఆది మధ్య గొడవ జరిగినట్టుగా కనిపిస్తుంది. గొడవ అంటే అదేదో సీరియస్ ఏం కాదు. షోలో భాగంగా ఫన్నీగా ఇద్దరూ ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటారు. అయితే హన్సిక ఏమాత్రం తగ్గకుండా హైపర్ ఆది నోర్మూయించింది. ఆమె వేసే పంచులకి హైపర్ ఆది తిరిగి మాట్లాడలేకపోయారు.

- Advertisement -

షోలో ఉన్న వారందరూ నవ్వుకున్నారు. ఇక వీళ్లిద్దరి మధ్య ఎలాంటి పంచులు నడిచాయి అంటే.. హన్సిక నాకు ఇది నచ్చలేదు అంటూ ఆది డైలాగ్ కొట్టగా, డోంట్ జడ్జ్ ద జడ్జ్ జడ్జ్ విల్ జడ్జ్ యు అంటూ బాలయ్య రేంజ్ లో డైలాగ్ చెప్పేస్తుంది. దీంతో హైపర్ ఆది ఏం అర్థం కాలేదు అన్నట్టుగా ఫేస్ పెడతారు. వెంటనే క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా హన్సిక అందుకుని డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ట్రబుల్ యు అంటూ మరో డైలాగ్ కొట్టేస్తుంది. దీంతో సెట్లో ఉన్న అందరూ నవ్వేశారు.

మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య నడిచిన ఈ ఫన్నీ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే భారీ వ్యూస్ వచ్చాయి. ఇదంతా చూస్తుంటే హన్సిక ఇక సినిమాలు వదిలేసి షోలకే పరిమితం అయిపోయే విధంగా కనిపిస్తుంది. జడ్జిగా ఆమె అన్ లిమిటెడ్ గా ఎంటర్టైన్ చేస్తుండడంతో బుల్లితెర ప్రేక్షకులకి ఈ బ్యూటీ మరింతగా దగ్గరయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. పెళ్లయ్యాక హన్సికకు సినిమా ఛాన్సులు తగ్గిన విషయం తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నా పెద్దగా ఈ ముద్దుగుమ్మకు కలిసి రావడం లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here