Anita : తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘నువ్వు నేను’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనిత. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో అమ్మడు ఓవర్ నైట్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ రోజుల్లో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అనిత తెలుగుతో పాటు దాదాపు దక్షిణాదికి చెందిన అన్ని భాషల్లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టి హిందీలో కూడా పలు సినిమాలలో నటించి తన సత్తా చాటుకుంది. 2001లో తన కెరీర్ ప్రారంభించి దాదాపుగా 30 పైగా సినిమాలలో నటించింది. తర్వాత అనిత బుల్లి తెరపై అడుగుపెట్టి ప్రతి ఇంటికి చేరువైంది. ఎక్కడ అవకాశం వచ్చినా తనేంటో నిరూపించుకుంటూ క్రేజ్ దక్కించుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో నిన్నటి తరం హీరోయిన్స్ అంతా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మళ్లీ నటన వైపు మళ్లుతున్నారు. చిన్న పాత్రల ద్వారా నైనా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అనిత కూడా ఈ మధ్యనే అలా సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టాలని ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకునేందుకు ట్రై చేస్తోంది. ఇతర హీరోయిన్ల రూట్లోనే అనిత కూడా పలు రకాల ఫోటోషూట్లతో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఇప్పటికే ఆమె చేసిన ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో అనిత నువ్వు నేను టైంలో కన్నా చాలా అందంగా కనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. థైస్ షో తో పాటు ఈ అమ్మడిలో దాగి ఉన్న అందాలన్నీ ప్రదర్శనకు పెట్టి కుర్రాళ్లని టెంప్ట్ చేసేస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ బాబోయ్ అనిత ఇలా రెచ్చిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.