Varun Sandesh : శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘హ్యాపీ డేస్’ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరో గా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్.తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వరుణ్ సందేశ్ కి అప్పట్లో పెద్ద బ్యానర్స్ లో నటించే ఛాన్స్ దక్కింది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుణ్ సందేశ్ ని పెట్టి ‘కొత్త బంగారు లోకం’ అనే సినిమా నిర్మించాడు.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కూడా ఆరోజుల్లో సెన్సేషనల్ హిట్ గా నిల్చింది.
టాలీవుడ్ కి మరో యంగ్ హీరో వచేసాడు, ఉదయ్ కిరణ్ మరియు తరుణ్ లాగా యూత్ ఐకాన్ ఐపోతాడని అప్పట్లో అందరూ అనుకునేవారు.కానీ ‘కొత్త బంగారు లోకం’ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు.కానీ ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు పాపం, దీనితో ఆయన వేరే పని చూసుకుందామని అమెరికా కి వెళ్ళాడు.
వరుణ్ సందేశ్ తో పాటుగా ఆయన భార్య రితిక షేరు కూడా వచ్చింది. వీళ్లిద్దరు ఒక సినిమాలో కలిసి హీరోహీరోయిన్లు గా నటించారు, ఆ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. క్యూట్ కపుల్ గా హౌస్ లో ఉన్నన్ని రోజులు కోట్లాది మంది ప్రజాధారణ అందుకున్నారు. వరుణ్ సందేశ్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు.
ఇదంతా పక్కన పడితే వరుణ్ సందేశ్ కి వరుస ఫ్లాప్స్ వస్తున్నప్పుడు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నారో చెప్పుకొచ్చింది ఆయన భార్య వితిక షేరు. ఆమె మాట్లాడుతూ ‘వరుణ్ కి ఒకానొక దశలో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో సినిమా అవకాశాలు తగ్గడం తో పాటు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నాము. చేతిలో 5 వేల రూపాయిలు కూడా లేని రోజులు ఉన్నాయి. అలా మేమిద్దరం ఎన్నో కష్టాలను ఎదురుకొని ఈరోజు నిలబడ్డాము’ అంటూ చెప్పుకొచ్చింది రితిక.