Srikanth : సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో.. ఎప్పుడు ఫ్లాపులు వస్తాయో.. ఎవరికి అర్థం కాదు. ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు ఘనవిజయం సాధించిన హీరోలు కూడా ఫ్లాపుల బాట పట్టి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అలాంటి నటీనటుల్లో హీరో శ్రీకాంత్ ఒకరు. మొదట విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా నటించి మధ్యలో కొంత కాలం ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. రీసెంట్ గా కోటబొమ్మాళి పియస్ సినిమాలో నటించి సక్సెస్ అందుకున్నాడు.

తాజాగా శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను నటించిన మహాత్మ చిత్రం తర్వాత వరుసగా తనకు వరుసగా 25 ఫ్లాపులు వచ్చాయన్నారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి పోటీనిచ్చిన శ్రీకాంత్.. ఇలా సంచలన వ్యాఖ్యలు చేసి వైరల్ అయ్యాడు. ఆమె సినిమా విజయం సాధించిందని.. ఆ సమయంలో తాజ్ మహల్, పెళ్లి సందడి చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని వ్యాఖ్యానించాడు.

మహాత్మ సినిమా తర్వాత తన కెరీర్‌కు పెద్ద దెబ్బ తగిలిందని.. మహాత్మా సినిమా నా 100వ సినిమా అని అన్నారు. ఆ సినిమా తర్వాత తన కెరీర్ నెమ్మదిగా పతనమైందని శ్రీకాంత్ వివరించాడు. ఆ సినిమా తర్వాత తనకు బ్యాడ్ టైమ్ మొదలైందని వ్యాఖ్యానించాడు. ఇండస్ట్రీలోకి కొత్తవాళ్లు రావడం కూడా ఓ కారణమని.. ప్రస్తుతం దేవర సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని శ్రీకాంత్ వివరించాడు. మరి శ్రీకాంత్ నటించబోవు సినిమాలన్నీ ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో చూడాలి మరి.