Actor Srihari : వెండితెర మీద హీరో గా, విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎంతో గొప్పగా రాణించి టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నటుడు రియల్ స్టార్ శ్రీహరి. సినిమాల్లో ఏదైనా బలమైన పాత్ర కనిపిస్తే ఇప్పటికీ అందులో మనం శ్రీహరి ని గుర్తు చేసుకుంటాం. ప్రేక్షకుల మదిలో ఆయన వేసిన ముద్ర అలాంటిది. ఎన్నో విభిన్నమైన పాత్రలతో తిరుగులేని ఇమేజి ని సంపాదించిన ఆయన 2013 వ సంవత్సరం లో కాన్సర్ బారిన పడి కన్నుమూసిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.
ఇప్పుడు ఇండస్ట్రీ లోకి ఎంత మంది వచ్చినా ఆయన లేని లోటుని మాత్రం ఎవ్వరు పూడ్చలేకపోతున్నారు. బ్రతికి ఉన్నన్ని రోజులు పెళ్ళాం పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకున్న శ్రీహరి ఇప్పుడు ఆయన లేకపోవడం తో వాళ్ళ పరిస్థితి ఎవరికీ అర్థం కాకుండా పోయింది.శ్రీహరి బ్రతికి ఉన్న రోజుల్లో అడిగినవారికి కాదు అనకుండా ఇష్టమొచ్చినట్టు అప్పులు ఇచ్చేసేవాడు.
ఒక ఊరుని దత్తత తీసుకొని పోషించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఆపదలో ఉన్న కొంతమంది మిత్రులకు భారీ మొత్తం లో సహాయం చేసాడు.వాళ్ళు ఇప్పుడు గొప్ప స్థానం లో ఉన్నారు, రీసెంట్ టైం లో శ్రీహరి భార్య శాంతి వాళ్ళని తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వండి పరిస్థితి అసలు ఏమి బాగాలేదు అని అడిగినా మొహం చాటేస్తున్నారట. అలా శ్రీహరి సహాయార్థం తన మిత్రులకు ఇచ్చిన అప్పులే 20 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట.
ఇప్పుడు ఆయన భార్య ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న తర్వాత కూడా వాళ్ళు ఆ డబ్బులను ఇవ్వకుండా నాటకాలు చేస్తున్నారంటే వాళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తుంది. శ్రీహరి కుమారుడు మేగంష్ శ్రీహరి గతం లో ‘రాజ్ దూత్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఇతగాడిని ఎవ్వరు పట్టించుకోవడం లేదు. శ్రీహరి సతీమణి కొడుకు మీదనే ఆశలు పెట్టుకుంది, అతను హీరో గా రాబొయ్యే రోజుల్లో సక్సెస్ కావాలని ఆశిద్దాం.